Corona Cases : దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు, రెండు మరణాలు

భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు.

Corona Cases : దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు, రెండు మరణాలు

CORONA (1)

Updated On : December 27, 2022 / 10:55 AM IST

corona cases : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆ దేశంలో రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు.

మొత్తం కేసుల సంఖ్య 4,46,77,302కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,428 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,41,43,179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 5,30,695కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది.

Corona Mock Drill : కరోనా కల్లోలం.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం, దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్

దేశవ్యాప్తంగా 0.01 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.80శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.05 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో మూడు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసును గుర్తించారు.