India Corona Cases : దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 1968 పాజిటివ్ కేసులు
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. వైరస్ నుంచి 3,481 మంది కోలుకోగా, మరో ఏడుగురు మృతి చెందారు.

india corona cases
India Corona Cases : కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. వైరస్ నుంచి 3,481 మంది కోలుకోగా, మరో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 34,598కి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.94శాతంగా ఉందని, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటిరవకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,99,466కు చేరింది. మొత్తం 4,40,36,152 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
వైరస్ బారిన పడి ఇప్పటివరకు 5,28,716 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో 218.80కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.