శత్రు దేశాలకు చుక్కలు చూపించే మన తేజస్ Mk-1A యుద్ధ విమానాలు వచ్చేస్తున్నాయ్.. ఇతర దేశాల యుద్ధ విమానాలతో పోల్చితే ఇలా..

తేజస్ Mk-1A దేశీయంగా అభివృద్ధి చేసిన సింగిల్ ఇంజిన్ మల్టీ రోల్ ఫైటర్ విమానం.

శత్రు దేశాలకు చుక్కలు చూపించే మన తేజస్ Mk-1A యుద్ధ విమానాలు వచ్చేస్తున్నాయ్.. ఇతర దేశాల యుద్ధ విమానాలతో పోల్చితే ఇలా..

Updated On : June 27, 2025 / 5:06 PM IST

తేజస్ Mk-1A ఫైటర్ జెట్‌లను 2026 మార్చిలోపు భారత వాయుసేనకు అప్పగిస్తామని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఛైర్మన్ డీకే సునీల్ తెలిపారు. తేజస్ Mk-1A దేశీయంగా అభివృద్ధి చేసిన సింగిల్ ఇంజిన్ మల్టీ రోల్ ఫైటర్ విమానం. శత్రు దేశాల ముప్పు పొంచి ఉన్న గగనతల పరిసరాల్లోనూ పనిచేసేలా, ఎయిర్ డిఫెన్స్, మెరైన్ రికానిసెన్స్, దాడుల మిషన్‌ల కోసం దీన్ని అభివృద్ధి చేశారు.

“తేజస్ Mk-1A ప్రపంచ స్థాయి విమానం. ఇందులో అత్యున్నత రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లు, వివిధ రకాల క్షిపణులు ఉన్నాయి. అత్యాధునిక అవియానిక్స్, ఆయుధాలతో ఈ విమానం అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. ఇది భారత వాయుసేనకు ఎంతో ఉపయోగపడుతుంది” అని సునీల్ తెలిపారు. 2021 ఫిబ్రవరిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ రూ.48,000 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది.

దీని ద్వారా 83 తేజస్ Mk-1A జెట్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మరో 97 యుద్ధ విమానాలను రూ.67,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. Mk-1A మిగ్-21 విమానాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించనున్నారు. ఇది దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంలో కీలక భాగంగా నిలుస్తోంది.

భారత రక్షణ రంగ ఆధునికీకరణలో తేజస్ Mk-1A ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ లైట్ మల్టీ రోల్ ఫైటర్ జెట్‌లు ఉన్నాయి. వీటిలో సాధారణంగా సింగిల్ ఇంజిన్ ఉండి, తక్కువ ఖర్చుతో ఎన్నే ప్రయోజనాలు చేకూర్చుతాయి.

ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రాఫెల్ రెండు ఇంజిన్లు ఉన్న 4.5 జనరేషన్ ఫైటర్ జెట్. ఇందులో అణు సామర్థ్యం ఉంటుంది. నాటోతో పాటు అనేక మిత్ర దేశాల వైమానిక దళాలు దీనిని ఉపయోగిస్తున్నాయి. భారత వాయుసేన వద్ద 36 రాఫెల్ విమానాలు ఉన్నాయి. భారత నౌకాదళం దీనికి సంబంధించిన సముద్ర వేరియంట్‌కు 26 ఆర్డర్ ఇచ్చింది.

ఇతర దేశాల యుద్ధ విమానాలతో పోల్చితే ఇలా..

వివరాలు తేజస్ Mk-1A డస్సాల్ట్ రాఫెల్ ఎఫ్-16 బ్లాక్ 70 JF-17 బ్లాక్ III FA-50 గోల్డెన్ ఈగిల్
దేశం భారత్ ఫ్రాన్స్ అమెరికా పాకిస్థాన్ / చైనా దక్షిణ కొరియా
తయారీ సంస్థ HAL / ADA డస్సాల్ట్ ఏవియేషన్ లాక్‌హీడ్ మార్టిన్ PAC / చెంగ్డు KAI / లాక్‌హీడ్ మార్టిన్
ఇప్పటికే తయారైనవి 51 సుమారు 240 సుమారు 3,100 177 సుమారు 220
ఆర్డర్లు 180 (83 + 97) 234 (భారత్ సహా) 112 250–60 ఎగుమతి ఆర్డర్లు 48 (పోలాండ్), 18 (మలేసియా)
పొడవు 43.3 అడుగులు 50.2 అడుగులు 49.3 అడుగులు 47.0 అడుగులు 43.0 అడుగులు
వింగ్స్‌పాన్ (విస్తృతి) 26.9 అడుగులు 35.8 అడుగులు 31.0 అడుగులు 31.0 అడుగులు 31.0 అడుగులు
ఎత్తు 14.4 అడుగులు 17.5 అడుగులు 16.7 అడుగులు 15.0 అడుగులు 16.2 అడుగులు
ఎంప్టీ వెయిట్ 6,560 కిలోలు 10,300 కిలోలు 9,207 కిలోలు 7,965 కిలోలు 7,200 కిలోలు
గరిష్ఠ లోడ్ సామర్థ్యం 5,300 కిలోలు 9,500 కిలోలు సుమారు 7,700 కిలోలు 3,700 కిలోలు సుమారు 4,300 కిలోలు
గరిష్ఠ టేకాఫ్ బరువు సుమారు 13,500 కిలోలు 24,500 కిలోలు 21,772 కిలోలు 13,500 కిలోలు 12,300 కిలోలు
ఇంజిన్ 1 × GE F404-IN20 2 × Snecma M88-2 1 × GE F110-GE-129 1 × Klimov RD-93MA 1 × GE F404 లేదా EJ200
గరిష్ఠ థ్రస్ట్ 84 kN 150 kN (కలిపి) 129 kN 84.4 kN సుమారు 98 kN
ఇంధన సామర్థ్యం 3,060 లీటర్లు (అంతర్గత) 4,700 లీటర్లు (అంతర్గత) 7,000 లీటర్లు సుమారు 3,000 లీటర్లు 2,990 లీటర్లు
ఫెర్రీ రేంజ్ సుమారు 3,000 కి.మీ 3,700 కి.మీ 4,220 కి.మీ 3,482 కి.మీ సుమారు 1,852 కి.మీ
గరిష్ఠ వేగం 2,200 కి.మీ/గం (Mach 1.8) 1,912 కి.మీ/గం (Mach 1.8) 2,414 కి.మీ/గం (Mach 2.0+) 1,975–2,200 కి.మీ/గం (Mach 1.6–1.8) 1,837 కి.మీ/గం (Mach 1.5)
సేవా ఎత్తు సుమారు 15,000 మీటర్లు 15,240 మీటర్లు 18,300 మీటర్లు సుమారు 16,700 మీటర్లు 14,630 మీటర్లు
యూనిట్ ఖర్చు 39–42 మిలియన్ డాలర్లు 90–100 మిలియన్ డాలర్లు (అంచనా) 50–60 మిలియన్ డాలర్లు సుమారు 25 మిలియన్ డాలర్లు సుమారు 30 మిలియన్ డాలర్లు