Video: లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా మైక్ కట్!

మైక్రోఫోన్ యాక్సెస్ కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభ్యర్థిస్తున్నట్లు ఉన్న వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

Video: లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా మైక్ కట్!

పార్లమెంట్ సమావేశాల్లో శుక్రవారం గందరగోళం నెలకొంది. నీట్‌లో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష పార్టీలు నిలదీశాయి. ఇండియా కూటమి, ఎన్డీఏ వాగ్వాదానికి దిగాయి. నీట్ పేపర్ లీక్ అంశాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లేవనెత్తడంతో మైక్‌ను ఆఫ్ చేశారని కాంగ్రెస్ శుక్రవారం పేర్కొంది.

ఆ తర్వాత మైక్రోఫోన్ యాక్సెస్ కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభ్యర్థిస్తున్నట్లు ఉన్న వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. నీట్ వివాదంపై చర్చ జరగాలని రాహుల్ గాంధీ కోరారు.

నీట్ పై ప్రభుత్వం నుంచి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నీట్ డిమాండ్‌పై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వల్ల యువత భవిష్యత్తు పాడైపోతుందని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా అన్నారు. హరియాణాలో పేపర్ లీక్ కేసులు అధికంగా నమోదయ్యాయని చెప్పారు.

నీట్ పేపర్ లీక్ అయితే దీనికి బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దాని నుంచి దూరంగా పారిపోతున్నారంటూ విమర్శింవచారు. నీట్ పై తాము చర్చను లేవనెత్తుతుంటే ప్రతిపక్ష నాయకుడి మైక్ ను స్విచ్ ఆఫ్ చేస్తున్నారని అన్నారు. నీట్ పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

Also Read: కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ కల్యాణ్ వస్తారు.. ఆ తర్వాత..: తెలంగాణ జనసేన నేతలు