Centre On Russia Imports: రష్యా నుంచి చమురు కొనవద్దని భారత్‌కు ఏ దేశమూ చెప్పలేదు: కేంద్రం

దేశ ప్రజలకు అవసరమైన చమురు ఉత్పత్తులు అందించాల్సిన నైతిక బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని, వాటిని కొనేందుకు వీలున్న ఏ దేశం నుంచైనా సరే కొంటామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. అలాగే, రష్యా నుంచి చమురు కొనవద్దని భారత్ కు ఏ దేశమూ చెప్పలేదని స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన దిగుమతులపై పడిన విషయం తెలిసిందే.

Centre On Russia Imports: రష్యా నుంచి చమురు కొనవద్దని భారత్‌కు ఏ దేశమూ చెప్పలేదు: కేంద్రం

Centre On Russia Imports

Updated On : October 8, 2022 / 11:10 AM IST

Centre On Russia Imports: దేశ ప్రజలకు అవసరమైన చమురు ఉత్పత్తులు అందించాల్సిన నైతిక బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని, వాటిని కొనేందుకు వీలున్న ఏ దేశం నుంచైనా సరే కొంటామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. అలాగే, రష్యా నుంచి చమురు కొనవద్దని భారత్ కు ఏ దేశమూ చెప్పలేదని స్పష్టం చేశారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన దిగుమతులపై పడిన విషయం తెలిసిందే. రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ ఆ దేశం నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తోందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. కాగా, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోన్న నేపథ్యంలో వస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి జైశంకర్ కూడా గతంలోనే తిప్పికొట్టారు.

ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి భార‌త్ చ‌మురు కొనుగోళ్లు చేయొద్ద‌ని యూర‌ప్ అంటోంద‌ని, అయితే, ఆంక్ష‌లు విధించిన వేళ‌ ర‌ష్యా నుంచి యూర‌ప్ మాత్రం గ్యాస్ దిగుమ‌తులు చేసుకోవ‌డం ఏంట‌ని ఆయ‌న ప్రశ్నించారు. ర‌ష్యా నుంచి యూర‌ప్‌ గ్యాస్ కొంటే యుద్ధానికి నిధులు ఇచ్చిన‌ట్లు కాదా? అని నిలదీశారు. భార‌త్ చ‌మురు కొంటేనే యుద్ధానికి ర‌ష్యాకు నిధులు ఇచ్చిన‌ట్లా? అని ప్ర‌శ్నించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..