Indian Idol 12 Finale : విజేత ఇతనే, ఆరోస్థానంలో షణ్ముఖ ప్రియ

ఇండియన్ ఐడల్ 12వ (Indian Idol 12) సీజన్ విజేత ఎవరో తేలిపోయింది. టైటిల్ విజేతగా షణ్ముఖ నిలుస్తుందని అందరూ భావించారు.

Indian Idol 12 Finale : విజేత ఇతనే, ఆరోస్థానంలో షణ్ముఖ ప్రియ

Idol

Updated On : August 16, 2021 / 6:21 AM IST

Pawandeep Rajan : ఇండియన్ ఐడల్ 12వ (Indian Idol 12) సీజన్ విజేత ఎవరో తేలిపోయింది. టైటిల్ విజేతగా షణ్ముఖ నిలుస్తుందని అందరూ భావించారు. కానీ..ఫైనల్స్ లో అడుగుపెట్టిన తెలుగు సింగర్ షణ్ముఖ..టైటిల్ వేటలో అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఈమె..ఆరోస్థానంలో నిలిచారు. ఇక ఐడల్ విజేతగా ‘పవన్ దీప్ రాజన్’ నిలిచారు. ఇతనికి టైటిల్ తో పాటు…రూ. 25 లక్షల చెక్కును అందచేశారు. ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ ను సోనీ టీవీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ పినాలేలో మొత్తం ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. జావేద్ ఆలీ, మనోజ్, ముంతాషిర్, మిల్కా సింగ్, సుఖ్వీందర్ సింగ్ తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.

Read More : Punjab : ఛాతిలోకి దూసుకెళ్లిన రాడ్డు, అయినా…మృత్యుంజయుడు

సంగీత ప్రియులను అలరించే రియాల్టీ షోగా ‘ఇండియన్ ఐడల్’ నిలుస్తోంది. సీజన్ 12 ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో చాలా మంది పాల్గొన్నారు. విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై చర్చలు జరిగాయి. తెలుగు అమ్మాయి..ఎంతగానో రాణిస్తూ..ఫైనల్ వరకు వెళ్లారు. ఈమె టైటిల్ గెలవాలని అందరూ ఆకాంక్షించారు. దాదాపు 12 గంటల పాటు ఫైనల్ పోటీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంగీత అభిమానులు తిలకించారు. ఫైనల్ విజేతగా ఎవరు నిలుస్తారని అందరూ ఎంతగానో ఉత్కంఠగా టీవీలకు అతుక్కపోయారు. చివరగా అద్బుత గానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన పవన్ దీప్ విజేత అని ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఇతరులు కూడా పాటలతో ఉత్సాహం నింపారు.