Punjab : ఛాతిలోకి దూసుకెళ్లిన రాడ్డు, అయినా…మృత్యుంజయుడు

గుండెకు అత్యంత సమీపంలో నుంచి ఆరడుగుల పొడవైన రాడ్డు దూసుకపోయింది. అత్యంత భీకరంగా ఉన్న ఈ దృశ్యాన్ని చూసి అందరూ చలించిపోయారు.

Punjab : ఛాతిలోకి దూసుకెళ్లిన రాడ్డు, అయినా…మృత్యుంజయుడు

Punjab

4 Inch Wide Rod Across The Chest: : గుండెకు అత్యంత సమీపంలో నుంచి ఆరడుగుల పొడవైన రాడ్డు దూసుకపోయింది. అత్యంత భీకరంగా ఉన్న ఈ దృశ్యాన్ని చూసి అందరూ చలించిపోయారు. రక్తపు మడుగులో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. అందరూ అనుకున్నారు. ఇక అతనికి భూమి మీద నూకలు చెల్లినట్లేనని. కానీ అతని సంకల్పం, ధైర్యం మృత్యువు ఓడిపోయింది. వైద్యులు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మరణాన్ని జయించాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : AP Schools : ఏపీలో స్కూళ్లు రీఓపెన్… పాటించాల్సిన రూల్స్

వివరాల్లోకి వెళితే…

పంజాబ్ రాష్ట్రంలోని బఠిండా – దిల్ కంబౌ జాతీయ రహదారిపై హర్దీప్ సింగ్ అనే వ్యక్తి…టాటా ఎస్ వాహనంలో వెళుతున్నాడు. అకస్మాత్తుగా వాహనం టైర్ పేలిపోయింది. దీంతో ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆ వాహనంలో ఉన్న ఇనుపచువ్వుల్లో ఒకటి..హర్దీప్ ఛాతిలోకి దూసుకెళ్లింది. బాధతో అల్లాడిపోయాడు. బతికించాలంటూ..అతను చేసిన ఆర్థ్రన అందర్నీ కలిచివేసింది. స్థానికులు అతడిని సమీపంలో ఉన్న ఆదేష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒకటి కాదు..రెండు కాదు..ఆరడుగుల పొడవున్న రాడ్డు ఛాతిలోకి దూసుకెళ్లడంతో వైద్యులు ఆందోళన చెందారు. గుండెకు సమీపం
నుంచి దూసుకెళ్లిన రాడ్డును తొలగించి..అతడిని బతికించాలని అనుకున్నారు. వెంటనే ఆపరేషన్ కు చర్యలు చేపట్టారు.

Read More :
CM Jagan Temple : రూ.2కోట్లతో.. సీఎం జగన్‌కు గుడి.. ఎవరు కట్టిస్తున్నారంటే..

ఆపరేషన్ సక్సెస్ :-
ముందుగా అతడి శరీరం బయట ఉన్న ఇనుప రాడ్డును కట్టర్ సహాయంతో తొలగించారు. అనంతరం ఆరుగురు సర్జన్లు, 15 మంది ఆరోగ్య సిబ్బంది ఐదు గంటల పాటు శ్రమించారు. దిగ్విజయంగా ఆపరేషన్ పూర్తి చేశారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో రక్తం విపరీతంగా కారుతుండడంతో వైద్యులు ఆందోళన చెందారు. అయినా..వస్తున్న ఆటంకాలను అధిగమించి…విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. వైద్యుల చేసిన కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఆపరేషన్ విజయంతంగా పూర్తి చేసి బతికించినందుకు హర్దీప్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.