AP Schools : ఏపీలో స్కూళ్లు రీఓపెన్… పాటించాల్సిన రూల్స్

తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్లో గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు..

AP Schools : ఏపీలో స్కూళ్లు రీఓపెన్… పాటించాల్సిన రూల్స్

Ap Schools

AP Schools Reopen : కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఆగస్టు 16, 2021) నుంచి రాష్ట్రంలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. విద్యార్థులు బడిబాట పట్టనున్నారు.

కాగా, తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది.
* స్కూల్లో గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు క్లాసులు పెట్టుకోవాలి
* వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న పెద్దలతో పిల్లల్ని స్కూళ్లకు అనుమతించొద్దు
* విద్యార్థులు, సిబ్బంది రోజూ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి
* మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు భౌతికదూరం పాటించాలి
* అసెంబ్లీ, క్రీడలు నిర్వహించడానికి వీల్లేదు
* ప్రతివారం స్కూల్ లో ర్యాండమ్ టెస్టులు చేయాలి
* విద్యార్థులు పెన్ను, పెన్సిల్, బుక్స్, బాటిల్స్ మార్చుకోవద్దు
* తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకూడదు

ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్స్ లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే క్లాసులు నిర్వహిస్తామని, స్కూల్స్‌ తెరిచేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. స్కూళ్లలోని క్లాస్‌ రూమ్ లు, స్టాఫ్ రూమ్స్‌లో సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్ చల్లించారు. ఇక స్కూళ్లలో కొవిడ్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు క్లాస్‌ రూమ్ లలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

కాగా, పాఠశాలలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఏ స్కూల్లో చూసినా రంగురంగుల బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం, కూర్చోడానికి రాసుకోవడానికి బెంచీలు, తొమ్మిది రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. నాడు నేడు మొదటి విడత కింద 2970 స్కూళ్లకు గాను 1 080 స్కూళ్లను అందంగా తీర్చిదిద్దారు. రూ.324 కోట్లు విడుదల చేయగా, రూ. 224 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ ఉండేవి కావు. బాలికల పరిస్థితి అసలు చెప్పనక్కర్లేదు. నీళ్లు రాణి కొళాయిలు దర్శనమిచ్చేవి. ఇప్పుడు అలాంటి కష్టాలు చాలావరకు తీరిపోయాయి. తొమ్మిది రకాల సౌకర్యాలు స్కూల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. నిత్యం మంచినీటి సరఫరా, టాయిలెట్స్, స్పోర్ట్స్ కిట్, బెంచీలు ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా గోడలకు రంగులు వేసి మంచి బొమ్మలు చిత్రీకరించారు. ప్రతి స్కూల్ కు మంచి ఆటస్థలం ఉంది.