Navy Chopper Accident: ముంబై సముద్రతీరం సమీపంలో కుప్పకూలిన భారత నౌకాదళ హెలికాప్టర్

ముంబై సముద్ర తీరానికి సమీపంలో భారత నౌకాదళానికి చెందిన అధునాతన తేలికపాటి నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

Navy Chopper

Navy Chopper Accident: ముంబయి సముద్ర తీరానికి సమీపంలో భారత నౌకాదళానికి చెందిన అధునాతన తేలికపాటి నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం ముంబయి సముద్ర తీరంలో కుప్పకూలింది. నేవీ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికిగల కారణాలను తెలుసుకొనేందుకు భారత నావికాదళం ఘటనపై విచారణకు ఆదేశించింది.

Indian Navy Fires: భారత నావికాదళం జరిపిన కాల్పుల్లో గాయపడ్డ తమిళనాడు మత్స్యకారుడు.. సీఎం స్టాలిన్ ఏం చేశారంటే?

భారత నావికాదళం ఏఎల్‌హెచ్ ముంబయి నుండి తీరానికి దగ్గరగా ఉందని, తక్షణ శోధన, రెస్క్యూ నౌకాదళ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించడం జరిగిందని భారత నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉంటే.. గత ఏడాది అక్టోబర్‌లో ఆర్మీకి చెందిన అడ్వాన్స్ డ్ తేలికపాటి హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ లో కూలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు సిబ్బంది మరణించిన విషయం విధితమే.