Indian Navy Fires: భారత నావికాదళం జరిపిన కాల్పుల్లో గాయపడ్డ తమిళనాడు మత్స్యకారుడు.. సీఎం స్టాలిన్ ఏం చేశారంటే?

భారత్-శ్రీలంక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని పాల్క్ బేలో అనుమానాస్పదగా సంచరిస్తున్న పడవపై భారత నావికా దళం సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Indian Navy Fires: భారత నావికాదళం జరిపిన కాల్పుల్లో గాయపడ్డ తమిళనాడు మత్స్యకారుడు.. సీఎం స్టాలిన్ ఏం చేశారంటే?

Indian Navy

Indian Navy Fires: భారత్-శ్రీలంక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని పాల్క్ బేలో అనుమానాస్పదగా సంచరిస్తున్న పడవపై భారత నౌకాదళం సిబ్బంది కాల్పలు జరిపారు. ఈ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తెల్లవారుజామున పాల్క్ బేలో పెట్రోలింగ్‌లో ఉన్న నౌకాదళ నౌక అనుమానాస్పద పడవను గుర్తించింది. పడవను ఆపాలని నౌకాదళం సిబ్బంది పదేపదే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోవటంతో ఓడ, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల ప్రకారం పడవను ఆపడానికి హెచ్చరిక కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పడవలో ఉన్నవారిలో ఒకరికి గాయం అయినట్లు చెన్నైలోని రక్షణ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Army Helicopter: ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి

నౌకాదళం సిబ్బంది జరిపిన కాల్పుల్లో గాయపడిన వ్యక్తికి నౌకద్వారా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఇండియన్ నేవీ చేతక్ హెలికాప్టర్ ద్వారా మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మత్స్యకారుడిని మైలాడుతురై జిల్లా వనగిరి గ్రామానికి చెందిన కె వీరవెల్ (30)గా తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. అయితే వీరవెల్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మత్స్యకారుడిని తొలుత రామనాథపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మధురైలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ ఆస్పత్రిలో గాయపడ్డ మత్స్యకారుడిని పరామర్శించాడు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. భారత నావికాదళం కాల్పుల్లో వీరవెల్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలియగానే నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఎంతో బాధపడ్డానని ఎంకె స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరవెల్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 20లక్షల సహాయాన్ని కూడా విడుదల చేశారు. అతనికి ప్రత్యేక వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తానని చెన్నైలో ని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ అన్నారు.