Army Helicopter: ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Army Helicopter: ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి

Army Helicopter: భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లా, సింగింగ్ ప్రాంతంలో కూలిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ప్రమాదానికి గురైంది ఆధునిక తేలికపాటి, హెచ్ఏఎల్ రుద్ర అనే హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ శుక్రవారం ఉదయం ట్యూటింగ్ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలోనే హెలికాప్టర్ కూలింది. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, ఇక్కడికి రవాణా సౌకర్యం లేకపోవడంతో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమైంది. ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు.

Moonlighting: మేనేజర్ల అనుమతితో ‘మూన్‌లైటింగ్’కు ఇన్ఫోసిస్ అనుమతి.. కానీ..!

అధికారులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హెలికాప్టర్లను దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలడం ఈ నెలలో రెండోసారి. ఈ నెల 5న ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిన ఘటనలో ఒక పైలట్ మరణించాడు.