Moonlighting: మేనేజర్ల అనుమతితో ‘మూన్‌లైటింగ్’కు ఇన్ఫోసిస్ అనుమతి.. కానీ..!

తమ కంపెనీ ఉద్యోగుల మూన్‌లైటింగ్‌కు ఐటీ సంస్థ ‘ఇన్ఫోసిస్’ అనుమతించింది. కంపెనీ మేనేజర్ల అనుమతితో మరో చోట పని చేయవచ్చని సూచించింది. అయితే, కొన్ని నిబంధనలు విధించింది.

Moonlighting: మేనేజర్ల అనుమతితో ‘మూన్‌లైటింగ్’కు ఇన్ఫోసిస్ అనుమతి.. కానీ..!

Moonlighting: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ‘మూన్‌లైటింగ్’కు అనుమతించింది. అయితే, అనేక షరతులు విధించింది. కొద్ది రోజులుగా ‘మూన్‌లైటింగ్’పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Swamy Goud: కమలానికి షాక్.. బీజేపీకి మరో నేత గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరనున్న స్వామి గౌడ్!

ఒక కంపెనీలో పని చేస్తూ, అలాంటి మరో కంపెనీలో రెండో ఉద్యోగం (పార్ట్ టైమ్/ఫుల్ టైమ్) చేయడాన్నే ‘మూన్‌లైటింగ్’ అంటారనే సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అంశంపై దృష్టి పెట్టిన కంపెనీలు దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అనేక కంపెనీలు ‘మూన్‌లైటింగ్’కు పాల్పడుతున్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా దీనిపై ఇన్ఫోసిస్ కీలక సూచనలు చేసింది. తమ ఉద్యోగుల ‘మూన్‌లైటింగ్’కు అనుమతించింది. మేనేజర్ల అనుమతితో ‘మూన్‌లైటింగ్’ చేసుకోవచ్చని తెలిపింది. కానీ, ఈ విషయంలో కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం.. ‘మూన్‌లైటింగ్’ చేయాలంటే ఇన్ఫోసిస్ కంపెనీకి పోటీగా ఉన్న సంస్థల్లో పని చేయరాదు.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

అలాగే తమ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలి. ఈ అంశంపై కంపెనీ తమ ఉద్యోగులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ గిగ్ వర్క్స్ లేదా మూన్‌లైటింగ్ అని మాత్రం చెప్పలేదు. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి చెందిన ఉద్యోగులు రెండో ఉద్యోగం చేస్తూ మరికొంత ఆదాయం సంపాదించుకునే వీలుంటుంది. మరోవైపు కంపెనీ నుంచి వలసలు కూడా తగ్గుతాయి.