Police Visits Twitter Office: ఢిల్లీలో ట్విట్టర్ కార్యాలయంపై పోలీసుల దాడులు

Police Visits Twitt
Twitter: ఢిల్లీలో ట్విట్టర్ కార్యాలయంపై పోలీసులు దాడులు చేశారు. బీజేపీ నేత సంబిత్ పాత్రా ట్వీట్‌కు మానిప్యూలేటెడ్ మీడియా అనే ట్యాగ్ జత చేసి ఆ పోస్టులు నకిలీవని నిర్ధారించింది. ఈ అంశంపై ట్విటర్ నుంచి వివరణ కోరారు పోలీసులు. అయితే ట్విటర్ వద్ద తమకు తెలియని సమాచారం ఉందని, అందుకే పాత్రా ట్వీట్‌కు మ్యానిపులేటెడ్ ట్యాగ్ వేసిందని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమాచారం ఏంటో తెలుసుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు.
ఢిల్లీ , గుర్గావ్‌లోని ట్విట్టర్ ఇండియా కార్యాలయాలపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దాడులు నిర్వహించింది . అనంతరం ట్విట్టర్ సంస్థ ప్రతినిధులకు నోటీసులు అందజేశారు పోలీసులు. బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాట్రా ట్వీట్‌ను మానిప్యులేటెడ్ మీడియా అని లేబుల్ చేసిన తర్వాత.. పోలీసులు ట్విట్టర్ ఇండియాకు లేఖ పంపిన ఒకరోజు తర్వాత ఇది జరిగింది.
కొన్ని రోజులుగా టూల్‌కిట్ తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ టూల్‌కిట్ సృష్టించి ప్రధాని మోడీతో పాటు దేశ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తుందని బీజేపీ ఆరోపించింది. కరోనా కొత్త రకానికి భారత్ స్ట్రెయిన్, మోదీ స్ట్రెయిన్ పేర్లతో ప్రచారం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. దీనికి బీజేపీ నేతలు వంతపాడడంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయం అగ్గి రాజేసుకుంది. అయితే, బీజేపీ ఆరోపణను కాంగ్రెస్ ఖండించింది. నకిలీ టూల్‌కిట్‌ను బీజేపీ ప్రచారం చేస్తోందని పేర్కొంది. ఈ క్రమంలో ఢిల్లీ ట్విట్టర్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు.
ట్విట్టర్ సంస్థకు, కేంద్ర ప్రభుత్వానికి రెండు, మూడు రోజులుగా ఈ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది అంటూ.. ఓ టూల్‌కిట్‌నూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దాని ప్రకారం.. దేశానికి చెడ్డపేరు తెచ్చేందుకు కాంగ్రెస్ టూల్ కిట్ రూపొందించిందని బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. అటువంటి ట్వీట్లకు మ్యానిపులేటెడ్ మీడియా అంటూ ట్విట్టర్ ట్యాగ్‌ను జత చేస్తోంది. ఇదే అసలు గొడవకు కారణం అవుతుంది.