India’s 1st COVID-19 Patient : భారత్ లో తొలి కరోనా రోగికి మరోసారి పాజిటివ్

భారత్ లో మొదటి కరోనా రోగికి మరోసారి వైరస్ సోకింది.

India’s 1st COVID-19 Patient : భారత్ లో తొలి కరోనా రోగికి మరోసారి పాజిటివ్

Covid (1)

Updated On : July 13, 2021 / 3:27 PM IST

India’s 1st COVID-19 Patient భారత్ లో మొదటి కరోనా రోగికి మరోసారి వైరస్ సోకింది. గతేడాది జనవరిలో చైనాలోని వూహాన్ నుంచి సెలవుల నిమిత్తం భారత్​కు వచ్చిన ఓ మెడిసిన్ విద్యార్థినికి జనవరి-30,2020న పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. భారత్ లో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు ఇదే. త్రిసూర్ హాస్పిటల్ లో 3 వారాల చికిత్స అనంతరం ఆ విద్యార్థిగా పూర్తిగా కోలుకుంది.

అయితే ఇప్పుడు ఆ విద్యార్థినికి మరోసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. కేరళలోని త్రిసూర్ అధికారులు మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. త్రిసూర్ కి చెందిన ఆ విద్యార్థిని చదువు రీత్యా ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్​ సోకినట్లు తేలింది. అయితే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చిందని..యాంటీజెన్ టెస్ట్ లో నెగిటివ్ గా వచ్చిందని త్రిసూర్ జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేజే రీనా తెలిపారు. ఆమెలో ఎలాంటి రోగ లక్షణాలు గుర్తించలేదని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఇంట్లోనే చికిత్స పొందుతోందని.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.