Plane Crashes: నాడు వైఎస్ నుంచి నేడు విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే..

ఇప్పటివరకు ఎన్నో ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో ఎందరో చనిపోయారు. వారిలో పలువురు ప్రముఖులు సైతం ఉన్నారు.

Plane Crashes: నాడు వైఎస్ నుంచి నేడు విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే..

Updated On : June 12, 2025 / 11:10 PM IST

Plane Crashes: విమాన ప్రమాదాలు పెను విషాదాలు నింపుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. అత్యంత సురక్షితం అనుకున్న గగనతల ప్రయాణం కొన్ని సమయాల్లో భారీ ప్రాణ నష్టానికి దారితీస్తోంది. ఇప్పటివరకు ఎన్నో ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో ఎందరో చనిపోయారు. వారిలో పలువురు ప్రముఖులు సైతం ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం గగనతల ప్రమాదాల్లో మరణించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వైఎస్ రాజశేఖర్ నుంచి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ వరకు.. ఇలా ఎందరో ప్రముఖులు గగనతల ప్రమాదాల్లో ప్రాణాలు వదిలారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హెలికాప్టర్ క్రాష్ లో మరణించారు. లోక్ సభ స్పీకర్ గా పని చేసిన జీఎంసీ బాలయోగి కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. విమాన ప్రమాదాల్లో చనిపోయిన వారిలో అత్యంత ప్రముఖులు కూడా ఉన్నారు.

* భారత అణు శాస్త్రవేత్తగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన హోమీ జహంగీర్ భాభా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణిలో కుప్పకూలిపోవడంతో మరణించారు. 1966లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం 117 మంది చనిపోయారు. 1996 జనవరి 24న ఈ దుర్ఘటన జరిగింది.
* 1973లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ప్రమాదంలో కుమార మంగళం బిర్లా చనిపోయారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ఆయన స్టీల్ మంత్రిగా ఉన్నారు.
* 1980లో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. 1980 జూన్ 23న ఈ గోరం జరిగింది.
* ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్‌కు చెందిన పిట్స్ S-2A గ్లైడర్‌ను నడుపుతూ మరణించారు.
* 1994లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న సురేంద్ర నాథ్ విమాన ప్రమాదంలో మరణించారు. తన కుటుంబంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన
సూపర్-కింగ్ విమానంలో ప్రయాణిస్తూ హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వతాల్లో కూలిపోవడంతో చనిపోయారు.

Also Read: విమాన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే పరిహారం ఎవరిస్తారు? విమాన కంపెనీలా? ఇన్సూరెన్స్ కంపెనీలా? ఎంత ఇస్తారు?

* మాజీ కేంద్రమంత్రి మాధవరావు సింధియా ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. కాన్పూర్‌కు వెళ్తున్న చార్టర్డ్ సెస్నా విమానం యూపీలోని మొయిన్ పురీ
సమీపంలో ఒక గ్రామంలో కూలిపోయింది. 2001 సెప్టెంబర్ 30న ప్లేన్ క్రాష్ అయ్యింది.
* టీడీపీ నేత, లోక్‌సభ 12వ స్పీకర్ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2022 మార్చి 3న ఈ దుర్ఘటన జరిగింది.
* ప్రముఖ నటి సౌందర్య ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుండి కరీంనగర్‌కు వెళ్తుండగా.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న ఈ ప్రమాదం జరిగింది.
* హర్యానా మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ.పి. జిందాల్, హర్యానా వ్యవసాయ మంత్రి సురేంద్ర సింగ్‌తో కలిసి, ఢిల్లీ నుండి చండీగఢ్‌కు వెళుతున్న
హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య కారణంగా కూలిపోవడంతో మరణించారు.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్తూరు జిల్లాకు వెళ్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల్ల అడవుల్లో
కూలిపోవడంతో మరణించారు. 2009 సెప్టెంబర్ 2న ఈ దుర్ఘటన జరిగింది.
* అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండూ పవన్ హన్స్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధం కోల్పోయిన తర్వాత
కూలిపోయింది. 2011 ఏప్రిల్ 30న ఈ ప్రమాదం జరిగింది.

* ఇండియా మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ తన భార్య మధులికా రావత్‌తో సహా 12 మందితో కలిసి ఇండియన్ ఎయిర్
ఫోర్స్ హెలికాప్టర్ లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. 2021 డిసెంబర్ 8న ఈ దుర్ఘటన జరిగింది.
* 2004లో అరుణాచల్ ప్రదేశ్ మంత్రి డెరా నటుంగ్, మేఘాలయ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రి సంగ్మా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
* ఇక ఇప్పుడు గుజరాత్ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్
రూపానీ ఉన్నారు.