Lucknow : ఇండియాలోనే ఖరీదైన ఈ స్వీట్ ధర కేజీ రూ.50 వేలు.. అంత రేటెందుకంటే?
ఇండియాలో అత్యంత ఖరీదైన స్వీట్ ధర కేవలం కేజీ రూ.50 వేలు. అంత ఖరీదు ఉండటానికి ఆ స్వీట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలని ఉందా.. చదవండి.

Lucknow
Lucknow : పండుగల సీజన్ మొదలవుతోంది. స్వీట్ షాపులన్నీ ప్రత్యేకమైన స్వీట్ల తయారీలో బిజీగా ఉన్నాయి. లక్నోలో ఓ ఫేమస్ స్వీట్ షాపు ‘చప్పన్ భోగ్’ ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్వీట్ అమ్మకాలు మొదలుపెట్టింది? దాని ఖరీదు.. స్పెషాలిటీ ఏంటో? చదవండి.
భోజనం తర్వాత స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు తింటున్నారా?
పండుగ సీజన్ దగ్గరకి వస్తున్న నేపథ్యంలో లక్నోలో ఫేమస్ స్వీట్ దుకాణం చప్పన్ బోగ్ ఓ ఖరీదైన స్వీట్ పరిచయం విక్రయాలు మొదలుపెట్టింది. దాని పేరు ‘ఎక్సోటికా’. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించబడిన గింజలు, ఎండిన పండ్లతో ఈ స్వీట్ తయారు చేస్తున్నారు. ఆ స్వీట్ పొరను 24 క్యారెట్ల బంగారంతో అలంకరిస్తున్నారు. ఓ కస్టమర్ రిక్వెస్ట్‌తో ఈ దుకాణం వాళ్లు ఈ ఖరీదైన స్వీట్ తయారీకి నిమగ్నం అయ్యారట.
Sweet Shop: అక్కడ కేజీ స్వీట్ రూ.16వేలు.. పైన పూతే స్పెషల్
కిన్నౌర్ నుండి పైన్ గింజలు, ఇరాన్ నుండి మమ్రా బాదం, ఆఫ్ఘనిస్తాన్ నుండి పిస్తా పప్పులు, సౌత్ ఆఫ్రికా నుండి మకాడమియా గింజలు, టర్రీ నుండి హాజెల్ నట్స్, కాశ్మీర్ నుండి కుంకుమ పువ్వు ఇవన్నీ ఈ స్వీట్‌లో యాడ్ చేస్తారట. ప్రతి స్వీట్‌ను 24 క్యారెట్ బంగారు పొరతో అలంకరించారు. 4 స్వీట్లు ఉన్న బాక్స్ రూ.2000 నుండి మొదలై 100 పీస్‌ల స్వీట్ బాక్స్ రూ.50,000 లు పలుకుతుంది. ఈ దుకాణం యజమాని రవీంద్రకుమార్ ప్రతిరోజు రూ.2000 ధర పలికే స్వీటు బాక్స్‌లు నాలుగు సెట్లు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. ఎక్సోటికా ప్రతి పీస్ 10 గ్రాముల బరువు ఉంటుందట. ఒక్కొక్కటి విడిగా రూ.500 లు. మొత్తానికి రాబోయే పండుగల్ని ప్రత్యేకంగా జరుపుకోవాలనుకునే వారు ఈ కాస్ట్లీ స్వీట్ ఆర్డర్ ఇచ్చేయడమే.