Covid-19 : దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు

Indias Reports 392,488 New Covid 19 Cases
Covid-19 Cases : దేశంలో గడిచిని 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.తాజాగా దేశంలో 3,92,488 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో 3, 689 మంది కరోనా బారిన పడి మరణించగా మొత్తం మరణాల సంఖ్య 2,15,542కు చేరింది.
3,07,865 మంది గత 24 గంటల్లో కోవిడ్ కు చికిత్స పొంది క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ కోలుకున్నవారి సంఖ్య 1,59,92,271 కు చేరింది. కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,95,57,457 కి చేరింది.
దేశంలో ఇప్పటికి 33,49,644 క్రియాశీలక కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 15,68,16,031 మంది టీకా వేయించుకున్నారు. దేశంలో ఆక్సిజన్ లభ్యత, కోవిడ్ మందుల లభ్యత గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం వైద్య నిపుణులతో సమావేశం అయ్యారు.