Goldman Baba falooda : 2కిలోల బంగారు నగలు ధరించి ఫలూదా అమ్ముతున్న వ్యాపారి..

చోరీల వీధిలో ఒంటిపై రెండు కిలోల బరువుండే బంగారు నగలు ధరించి మరీ ఫలూదా అమ్ముతున్నాడో వ్యాపారి. అతనితో సెల్ఫీలు తీసుకోవటానికి కష్టమర్లు ఎగబడుతుంటారు.

Goldman Baba falooda  seller  in indores : ఓ దుకాణదారుడు ఫలుదా అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటీ ఫలూదా అమ్మటంలో పెద్ద విశేషమేముంది? అని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఆ ఫలూదా అమ్మే వ్యక్తే పేద్ద స్పెషల్ అట్రాక్షన్.ఈ స్పెషల్ ఏమిటంటే.. అలా ఫలుడా అమ్మే వ్యక్తి.. తన ఒంటినిండా బంగారు నగలు ధరించి మరీ ఫలూదా అమ్ముతున్నాడు.అతని ఒంటిమీద సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. ఇంత బంగారం వేసుకున్నప్పుడు అతడు చిన్నపాటి వ్యాపారం ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటీ అనే డౌట్ కూడా వచ్చి తీరుతుంది. దానికి కూడా సమాధానం ఉందండోయ్.! అదికూడా వింతే మరి..!!ఆ బంగారు నగల దుకాణంలా కనిపించే ఆ ఫలూదా వ్యాపారి వింతలేమిటో విశేషాలేమిటో తెలిసేసుకుందాం రండి..మరి..

Also read : Gold Man Kunjal Patel : గోల్డ్‌మ్యాన్ ఆత్మహత్య

నట్వర్ నేమా అనే వ్యక్తి ఒంటిమీద రెండు కిలోల బరువుండే బంగారు నగలు ధరించి మరీ ఇండోర్‌లోని సరాఫా చౌపటీలో రబ్రీ ఫలుడా అమ్ముతున్నాడు. ఫలూడా తినేందుకు షాప్ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కచ్చితంగా ఈ ‘గోల్డ్ మ్యాన్’తో సెల్ఫీ దిగుతారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విభిన్న రుచులకు ప్రసిద్ధి. ఈ నగరానికి వచ్చేవారు చాలామంది ఖచ్చితంగా ఒకసారైనా సరాఫా చౌపటీని సందర్శిస్తారు. ఈ మార్కెట్‌లో బంగారం, వెండిని విక్రయిస్తారు. అదే రాత్రి సమయంలో, ఈ స్ట్రీట్ చోరీ వీధిగా మారుతుంది. ఇక్కడే ‘గోల్డ్‌మన్ బాబా’ అంటే నట్వర్ నేమా రబ్రీ కుల్ఫీని విక్రయిస్తాడు.

అతను అమ్మే ఫలుడా ఎంత ప్రసిద్ధి చెందిందో.. అదే విధంగా అతను ఓ లోకల్ సెలబ్రెటీ హోదాను దక్కించుకున్నారు. ఎందుకంటే నట్వర్ రెండు కిలోల బంగారం ధరించి దుకాణం వద్ద కూర్చుంటాడు. అదే ఆయనగారి స్పెషల్..వ్యాపారం గిరాకీ పెంచుకోవటానికి ఇదో టెక్నిక్ అంటుంటారు కొంతమంది.

ట్రెండింగ్ వార్తలు