International Tiger Day 2023: పులులను చూడాలని ఉందా? ఇక్కడికి వెళ్లాల్సిందే..

దేశంలోని పలు టైగర్ రిజర్వ్, నేషనల్ పార్కుల్లోని పులులను చూసి తీర్చాల్సిందే.

International Tiger Day 2023: పులులను చూడాలని ఉందా? ఇక్కడికి వెళ్లాల్సిందే..

International Tiger Day 2023

International Tiger Day 2023 – India: చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పులులను చూడాలని ఉంటుంది. దాని ఆకారం, వేట, అడవిలో అది సంచరించే తీరు చాలా ఆకర్షిస్తుంది. భారత్‌లో మొత్తం 3,167 పులులు ఉన్నాయి. ప్రపంచ పర్యాటకులను ఇవి కూడా బాగా ఆకర్షిస్తాయి. హైదరాబాద్‌(Hyderabad)లోని నెహ్రూ నెహ్రూ జూలాజికల్ పార్క్‌(Nehru Zoological Park)లోనూ పులిని చూడొచ్చు. అయితే, దేశంలోని పలు టైగర్ రిజర్వ్, నేషనల్ పార్కుల్లోని పులులను చూసి తీర్చాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా వీటికి పేరుంది మరీ.

ఈ ప్రాంతాల్లో చూస్తే ఎప్పటికీ మరువలేని అనుభవం..
కార్బెట్ టైగర్ రిజర్వ్, ఉత్తరాఖండ్
రణతంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్
బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
పెంచ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
సాత్పురా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
పన్నా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
కజిరంగా నేషనల్ పార్క్, అసోం
సుందర్బన్స్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్
నాగర్‌హోల్ నేషనల్ పార్క్, కర్ణాటక
బందీపూర్ నేషనల్ పార్క్, కర్ణాటక
పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.