PM Modi : సోమవారం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న మోదీ
జూన్-21న ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.

International Yoga Day Pm Modi Set To Address Programme Tomorrow
PM Modi జూన్-21న ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ ఓ ట్వీట్ లో తెలిపారు. ఈ ఏడాది యోగా ఫర్ వెల్ నెస్(ఆరోగ్యం కోసం యోగా)అనే థీమ్ తో ఈ ఏడాది 7వ ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహించుకుంటున్నట్లు మోదీ తన ట్వీట్ లో తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధన చేయాలనేది ఈ థీమ్ ఉద్దేశమని ప్రధాని తెలిపారు.
మోడీ ప్రసంగం అనంతరం శ్రీశ్రీ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్ తో సహా 15 మంది అధ్యాత్మిక వేత్తలు, యోగా గురువులు సందేశాలు వినిపించనున్నారు. యోగాను ప్రజల వద్దకు చేరువ వేసేందుకు పలు సంస్థలు డిజిటల్ మాధ్యమంలో కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
యోగాని విశ్వవ్యాప్తం చేసేందుకు గురుతర బాధ్యతను భుజానికెత్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 డిసెంబర్ లో ఐక్యరాజ్యసమితిలో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. దీనికి 175 దేశాలు మద్దతు తెలిపాయి. సంవత్సరంలోని 365 రోజుల్లో అత్యంత ఎక్కువ పగటి సమయం ఉండే జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని యూఎస్ తీర్మానించింది. 2015 లో మొదటి ఇంటర్నేషనల్ యోగా డే జరపుకోగా..ఇప్పుడు ఏడవ యోగా డే ని జరుకునేందుకు సిద్దమయ్యాం.