Replacing Tomato With Avocado : టమాటా ప్లేస్‌ను రీప్లేస్ చేస్తున్న అవకాడో.. మహిళ షేర్ చేసిన పోస్ట్ వైరల్
టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో అవకాడో ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఇప్పుడు టమాటాకి ప్రత్యామ్నాయంగా అవకాడో ప్రతి ఇంట్లో చేరుతోందట. ఓ మహిళ ఇంటర్నెట్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Replacing Tomato With Avocado
Replacing Tomato With Avocado : కొన్ని వారాలుగా భారీగా పెరిగిన టమాటా ధరలు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొనే పరిస్థితి కనిపించడం లేదు. అయితే చాలామంది టమాటాకి ప్రత్యామ్నాయాలు వెతికారు. టమాటా ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు టమాటా స్ధానంలో అవకాడోను రీప్లేస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ మహిళ ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Tomato Prices : కిలో టమాటాలు రూ.80లకే విక్రయిస్తున్న రైతు సోదరులు ..
అవకాడో ధరల తగ్గుదల టమాట ధరల పెరుగుదల రెండు సమానంగా ఉన్నాయి. చాలామంది ఇండియన్స్ కిలో అవకాడోలను కిలో టమాటాల ధరతో సమానంగా కొనవచ్చు అని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా యూజర్ @_subiii_ తన పోస్ట్‌లో షేర్ చేశారు. ‘ఆర్ధిక వ్యవస్థలో అల్పాహారం కోసం అవకాడో టోస్ట్ తయారు చేయడం టమాటా చట్నీ కంటే చౌకగా ఉంది’ అనే శీర్షికను కూడా యాడ్ చేశారు. పోస్ట్ ప్రకారం ఒక అవకాడో (సుమారు 200 గ్రాముల బరువు) ధర కేవలం రూ.59 కాగా టమాటాలు మార్కెట్లో కిలో రూ.222 పలుకుతున్నాయి.
Tomatoes Free For Passport Photo : అక్కడ ఫోటో దిగితే.. టమాటాలు ఫ్రీ
ఇక ఈ పోస్ట్‌పై చాలామంది నెటిజన్లు స్పందించారు. అవకాడో తక్కువ ధరను చూసి ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా రూ.200 కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. భవిష్యత్తులో వీటి ధర కిలో రూ.300 కి చేరుకునే అవకాశం ఉందని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
it’s just a time in the economy when making avocado toast for breakfast is cheaper than dosa and tomato chutney pic.twitter.com/DgtuRj7OSv
— subiii (@_subiii_) August 3, 2023