జయహో ఇస్రో : PSLV-C47 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం చేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం సక్సెస్ అయ్యింది. పీఎస్ఎల్వీ-సీ47.. 14

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 04:37 AM IST
జయహో ఇస్రో : PSLV-C47 ప్రయోగం సక్సెస్

Updated On : November 27, 2019 / 4:37 AM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం చేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం సక్సెస్ అయ్యింది. పీఎస్ఎల్వీ-సీ47.. 14

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం చేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం సక్సెస్ అయ్యింది. పీఎస్ఎల్వీ-సీ47.. 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇందులో స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు ఉన్నాయి. బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం సరిగ్గా 9:28 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ47 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్(సతీష్ ధావన్ స్పేస్ సెంటర్) కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్ర‌యోగించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ-47.. స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్ 3తో పాటు 13 అమెరికా కమర్షియల్ నానో శాటిలైట్లను మోసుకెళ్లింది. 27 నిమిషాల్లో వీటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. హై రెజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న ఉపగ్రహంగా కార్టోశాట్ 3ని శాస్త్రవేత్తలు రూపొందించారు. కార్టోశాట్-3 ప్రకృతి విపత్తుల సమయంలో సేవలు అందించనుంది. అలాగే ఉగ్రవాద శిబిరాల ఫొటోలను మరింత స్పష్టంగా తీసే వెసులుబాటు ఉంటుంది. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.

కార్టోశాట్‌-3 ఉపగ్రహం భూ వాతావరణం పరిశీలన, విపత్తుల అధ్యయనం కోసం ఉపయోగపడనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టోశాట్‌-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టోశాట్‌-3 ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది.

కార్టోశాట్-3 సైనిక అవసరాలకు కూడా ఉపయోగపడనుంది. ఉగ్రవాద శిబిరాలు, శత్రువులకు సంబంధించిన ఫొటోలను స్పష్టంగా తీయటానికి వీలవుతుంది. పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగానికి మంగళవారం(నవంబర్ 26,2019) ఉదయం కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. నిజానికి ఈ ప్రయోగం నవంబర్ 25వ తేదీనే చేపట్టాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.

కార్టోశాట్-3 ప్రత్యేకతలు:
* కార్టోశాట్ సిరీస్ లో ఇది 9వ ఉపగ్రహం
* ఐదేళ్లపాటు సేవలు అందించనున్న కార్టోశాట్-3
* అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూపరిశీలన ఉపగ్రహం
* సరిహద్దుల్లో చొరబడే ఉగ్రవాదులను పసిగట్టగల కార్టోశాట్-3
* ఉగ్రవాదుల కదలికలు, స్థావరాలపై నిఘా నేత్రం
* దేశ రక్షణ రంగానికి నిఘా నేత్రంలా పని చేస్తుంది
* కార్టోశాట్-3లో మూడో తరానికి చెందిన హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ వ్యవస్థ
* 25 సెం.మీ రెజల్యూషన్ తో 16 కిమీ పరిధిలో ఫోటోలు తీయగల సత్తా
* కార్టోశాట్-3లో మల్టీస్పెక్ట్రల్, హైపర్ స్పెక్ట్రల్ వంటి అధునాతన వ్యవస్థలు
* ఉగ్రవాద శిబిరాల్లోని శత్రువులను జూమ్ చేసి ఫోటో తీసే వీలు
* భూమిని అణువణువూ జల్లెడ పట్టగల ఉపగ్రహం
* తీర ప్రాంతాలను జల్లెడ పట్టగల సామర్థ్యం
* సైనిక అవసరాలు, ప్రకృతి విపత్తలు అధ్యయనం కోసం ప్రయోగం