ఇస్రో కొన్ని రోజుల క్రితం ప్రయోగించిన రెండు ఉపగ్రహాలను ఇవాళ విజయవంతంగా అనుసంధానం చేసింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగవ దేశంగా ఇండియా నిలిచింది.
ఇంతకుముందు ఈ ఘనతసాధించిన దేశాల జాబితాలో అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. రెండు వారాల క్రితం ఏపీలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో పీఎస్ఎల్ల్వీ సీ-60 రాకెట్ రెండు ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ శాటిలైట్స్ 440 కిలోల బరువు ఉంటాయి. శాటిలైట్‌ల అనుసంధాన ప్రక్రియను ఎట్టకేలకు ఇవాళ చేపట్టారు. రెండు శాటిలైట్ల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించారు. అనంతరం వాటిని హోల్డ్ చేసి డాకింగ్ ప్రారంభించారు. చివరకు ఇది సక్సెస్ అయినట్లు ఇస్రో తెలిపింది.
తమ టీమ్‌కు, భారత ప్రజలకు అభినందనలు చెప్పింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో భారత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఈ ప్రయోగం ముఖ్యమైనదిగా నిలిచిందని చెప్పారు.
SpaDeX Docking Update:
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
— ISRO (@isro) January 16, 2025
Israel-Hamas ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్, అమెరికా ఏమన్నాయి?