ISRO chairman Somnath : ఇస్రో ప్రతీరోజూ 100 సైబర్ దాడులను ఎదుర్కొంటుందా..? ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏం చెప్పారంటే
ప్రస్తుతం కాలంలో అధునాతన టెక్నాలజీ ఒక వరం. కానీ, అదే సమయంలో ముప్పుకూడా పొంచిఉందని ఇస్రో చైర్మన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి

ISRO chairman Somnath
ISRO Faces Over 100 Cyber Attacks Every Day: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ సైబర్ దాడులను ఎదుర్కొంటుందని, అలాంటి దాడులను ఎదుర్కోవడానికి సంస్థ బలమైన సైబర్ సెక్యూరిటీ నెట్ వర్క్ ను కలిగి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. కేరళలో జరిగిన అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ లో సోమనాథ్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాప్ట్ వేర్, చిప్ ఆధారిత హార్డ్ వేర్ ను ఉపయోగించే రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులు జరిగే అవకాశం చాలా ఎక్కువ అని చెప్పారు. సాప్ట్ వేర్ తో పాటు, రాకెట్ లలోని హార్డ్ వేర్ చిప్ ల భద్రతపై దృష్టి సారించి వివిధ పరీక్షలతో ఇస్రో ముందుకెళ్తుందని తెలిపారు.
Read Also : Sachin Tendulkar: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి సచిన్ సందేశం.. ఎందుకో తెలుసా?
గతంలో ఒక ఉపగ్రహాన్ని పర్యవేక్షించే విధానం ఉండేది. కానీ, ఇప్పుడు ఒకేసారి అనేక ఉపగ్రహాలను పర్యవేక్షించే సాప్ట్ వేర్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఇది, ఈ రంగం వృద్ధిని సూచిస్తుందని అన్నారు. నావిగేషన్, మెయింటెనెన్స్ మొదలైన వాటికోసం వివిధ రకాల ఉపగ్రహాలు ఉన్నాయని అన్నారు. ఇవికాకుండా, సాధారణ ప్రజల రోజువారీ జీవితానికి సహాయపడే ఉపగ్రహాలు కూడా ఉన్నాయని, అవన్నీ వివిధ రకాల సాప్ట్ వేర్ ల ద్వారా నియంత్రించబడతాయని చెప్పారు. సైబర్ దాడుల నుంచి వీటన్నింటిని రక్షించడానికి భద్రత చాలా ముఖ్యమని ఇస్రో చైర్మన్ తెలిపారు.
ప్రస్తుతం కాలంలో అధునాతన టెక్నాలజీ ఒక వరం. కానీ, అదే సమయంలో ముప్పుకూడా పొంచిఉందని ఇస్రో చైర్మన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను మనం అదే టెక్నాలజీతో ఎదుర్కోగలమని, ఆ దిశగా పరిశోధనలు, కృషి జరగాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడ్డారు.