చంద్రుడిపై ఇస్రో మార్క్ : 2019లో 32 ప్రయోగాలు..

కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2019లో కూడా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతుంది. ఈ ఏడాది ఇస్రో మొత్తం 32 ప్రయోగాలు చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.2022 నాటికి గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాసెస్ ను 2019లో వేగవంతం చేస్తామని తెలిపింది

  • Published By: veegamteam ,Published On : January 4, 2019 / 07:01 AM IST
చంద్రుడిపై ఇస్రో మార్క్ : 2019లో 32 ప్రయోగాలు..

కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2019లో కూడా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతుంది. ఈ ఏడాది ఇస్రో మొత్తం 32 ప్రయోగాలు చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.2022 నాటికి గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాసెస్ ను 2019లో వేగవంతం చేస్తామని తెలిపింది

నెల్లూరు : కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2019లో కూడా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతుంది. ఈ ఏడాది ఇస్రో మొత్తం 32 ప్రయోగాలు చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.2022 నాటికి గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాసెస్ ను 2019లో వేగవంతం చేస్తామని తెలిపింది. 2019లో ఇస్రో కు చాలా సవాళ్లు వున్నాయనీ వాటిని అధిగమించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. 2018లో 16 ప్రయోగాలు అయ్యాయనీ..వాటిలో ఏడు మిషన్స్ కేవలం 35 రోజుల్లోనే చేపట్టామన్నారు. 2019 జనవరి-ఫిబ్రవరి మధ్యలో చంద్రయాన్ -2ను ప్రయోగిస్తామని శివన్ తెలిపారు. అలాగే అధిక వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం జీశాట్‌-20 ఉప్రగహాన్ని కూడ కక్ష్యలోకి పంపనున్నారు.

చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలే లక్ష్యంగా చంద్రయాన్‌-2ను ఇస్రో చేపట్టనుంది. ఇంతవరకూ ఏ దేశం చేరుకోని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్లడానికి ఇస్రో ప్రణాళిక వేసింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రునిపై వ్యర్థ రహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో అధ్యయనం చేయనుంది. ఈ అణుశక్తి ట్రిలియన్‌ డాలర్ల విలువ చేయనుంది. ఇస్రో చంద్రయాన్‌-2లో పంపనున్న రోవర్‌ ద్వారా నీరు, హీలియం-3 జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది. ఆ మూలకాలను చంద్రుడి నుంచి భూమికి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న దేశాలు ఈ ప్రక్రియను తమ చెప్పుచేతల్లో పెట్టుకొనే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగంతో భారత స్థానాన్ని చంద్రయాన్‌-2 మరింత పటిష్ఠం చేయనుంది.

చంద్రునిపై ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్‌, రష్యా దేశాలు తమ ప్రయోగాలతో పోటీ పడుతున్నాయి. ఇస్రో చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌, రోవర్‌ను పంపనుంది. ఈ ప్రయోగానికి రూ.600 కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు. గతనెలలో శ్రీహరికోట వేదికగా ఇస్రో ప్రవేశపెట్టిన జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్ 11 ప్రయోగం విజయవంతమైంది. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ఎనిమిదేళ్ల పాటు సేవలందించనుంది.