Proba-3: ప్రోబా-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీమ్‌

కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించి, కరోనాను శోధిస్తుంది ఈ ప్రయోగం.

Proba-3: ప్రోబా-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీమ్‌

Updated On : December 4, 2024 / 9:42 AM IST

సూర్యుడి గుట్టును విప్పడానికి ఇస్రో, ఐరోపా అంతరిక్ష సంస్థ-ఈఎస్‌ఏ కలిసి ప్రయోగానికి సిద్ధమయ్యాయి. సూర్యుడి వెలుపలి వలయం కరోనాపై పరిశోధనలు చేసేందుకు ఈఎస్‌ఏ చేపట్టిన ప్రయోగానికి సంబంధించిన జంట ఉపగ్రహాలను ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్‌ ద్వారా నింగికి పంపనుంది.

కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించి, కరోనాను శోధిస్తుంది ఈ ప్రయోగం. ప్రోబా-3 పేరుతో నిర్వహిస్తోన్న ఈ ఉపగ్రహ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. నిన్న మధాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్‌ స్పెస్‌ సెంటర్‌-షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇవాళ సాయంత్రం 4.08 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు.

తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు


ఇస్రో శాస్త్రవేత్తలు ఇవాళ ఉదయం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్న ఇస్రో టీమ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంది.