ISRO : PSLV సీ52 రాకెట్‌ కౌంట్ డౌన్ స్టార్ట్, రేపే ప్రయోగం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టుల బృందం దర్శించుకుంది. స్వామి వారిని దర్శించుకుని పీఎస్‌ఎల్వీ రాకెట్‌ విజయవంతం కావాలని మొక్కులు...

ISRO : PSLV సీ52 రాకెట్‌ కౌంట్ డౌన్ స్టార్ట్, రేపే ప్రయోగం

Gslv F 10 Rocket

Updated On : February 13, 2022 / 7:23 AM IST

PSLV-C52 : ఇస్రో ప్రయోగానికి కౌంట్‌డౌన్ స్టార్ అయింది. 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్‌ పూర్తవగానే శ్రీహరికోటలోని షార్‌ నుంచి సోమవారం ఉదయం 5:59గంటలకు నింగిలోకి PSLV సీ52 రాకెట్‌ దూసుకెళ్లనుంది. రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో లాంచ్‌ ఆథరైజేషన్‌ శనివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నింగిలోకి దూసుకళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 17 వందల 10 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది.

Read More : Telangana : కాషాయ పార్టీపై కేసీఆర్ గర్జన.. కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా ఉంది

ప్రయోగం సందర్భంగా.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టుల బృందం దర్శించుకుంది. స్వామి వారిని దర్శించుకుని పీఎస్‌ఎల్వీ రాకెట్‌ విజయవంతం కావాలని మొక్కులు చెల్లించుకున్నారు. రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. R1 సాట్‌1 అని కూడా పిలిచే EOS-04 కాకుండా మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ వెహికల్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. INS-2TD అనేది భారతదేశం-భూటాన్ జాయింట్ శాటిలైట్. వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్లు, నేలపై ఉండే తేమ, హైడ్రాలజీ, వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాల కోసం ESO-04 రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు.

Read More : Mohan Babu : జీవితంలో రిస్కులు చేయాలి.. ఒక్క పాట కోసం చాలా ఖర్చుపెట్టాం

అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి రూపొందించిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమే EOS-04 అని ఇస్రో తెలిపింది. ఇందులో మరో రెండు చిన్న నానో శాటిలైట్లను సిద్దం చేశారు. ఇందులో ఒకటి ఇన్స్పైర్ శాట్-1. దీన్ని యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ తో కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. రెండో చిన్న శాటిలైట్ పేరు ఐఎన్ఎస్-2టీడీ. ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో ఛైర్మన్‌గా సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ ప్రయోగం చేపడుతున్నారు.