ముద్దు కోసం ఎన్ని తిప్పలో.. చితక్కొట్టిన పోలీసులు..!

  • Published By: vamsi ,Published On : February 21, 2019 / 07:17 AM IST
ముద్దు కోసం ఎన్ని తిప్పలో.. చితక్కొట్టిన పోలీసులు..!

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత ఖఠినం అంటారు కదా? అదే పరిస్థితి ఎదురైంది ఓ ప్రియుడుకి. ఓ ప్రియురాలు అడిగిన కోరిక ప్రియుడికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ప్రియురాలు ఇచ్చే ముద్దు కోసం చేసిన పనితో ఐటీఐ చదువుతున్న ఓ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. జనాల చేతిలో,  పోలీసుల చేతిలో దేహశుద్ది కూడా తప్పలేదు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో చోటుచేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. 
    

తమిళనాడులోని పట్టాభిరామ్ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్(22) అన్నాసాలైలోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ట్రస్ట్ తరపున ఉద్యోగ శిక్షణలో ఉన్న ఓ యువతితో శక్తివేల్ కి పరిచయం ఏర్పడగా వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ వేలంటైన్స్ డే సంధర్భంగా చిన్న పందెం వేసుకున్నారు. వాలంటైన్స్ డే రోజున ముద్దు కోవాలని ప్రేయసిని ప్రియుడు కోరాడు. అందుకు నిరాకరించిన యువతి.. శక్తివేల్ బ్రతిమిలాడటంతో ఓ కండిషన్ తో ముద్దు ఇచ్చేందుకు సిద్ధం అంటూ అంగీకరించింది. 
  

 ఆ కండీషన్ ఏమిటంటే.. ముస్లీం మహిళలు దరించే బురఖా వేసుకుని రాయపేట నుంచి మెరీనా బీచ్ వరకు రావాలని, అలా చేస్తే ముద్దు ఇస్తానంటూ యువతి చెప్పింది. దీంతో శక్తివేల్ బురఖా వేసుకొని ఆ పని చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే.. అలా చేస్తున్న సమయంలో శక్తివేల్ తీరును గమనించిన కొందరు స్థానికులు అనుమానంతో అతనిని పట్టుకుని చితకబాదారు. అతనిని వెంట పట్టుకొని పోలీసులకు అప్పగించగా వాళ్లు కూడా దేహశుద్ది చేయడంతో.. శక్తివేల్ అసలు నిజం బయటపెట్టాడు. శక్తివేల్ చెప్పిన బురఖా కథను విన్న పోలీసులు అవాక్కై అతని ప్రియురాలితో విషయాన్ని నిర్ధారించుకుని అతనిని వదిలిపెట్టారు.

Read Also: ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్
Read Also:జెట్ ఎయిర్‌వేస్ విమాన టికెట్‌పై 50 శాతం డిస్కౌంట్
Read Also:కేంద్రం కీలక ఆదేశాలు : బోర్డర్ కు విమానాల్లోనే బలగాల తరలింపు