CRPF Killed 175 Terrorists : జమ్ముకశ్మీర్ లో 175 మంది ఉగ్రవాదులను అంతమొందించిన సీఆర్పీఎఫ్..
జమ్ముకశ్మీర్ లో సంవత్సర కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హతమార్చింది. మరో 183 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకుంది.

Crpf Killed 175 Terrorists, Captured 183 Since March 1 Last Year, Says Dg
CRPF killed 175 terrorists, captured 183 since March 1 last year : జమ్ముకశ్వీర్ లో అంటే ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన భారత ఆర్మీ గుర్తుకొస్తుంది. ఉగ్రవాదుల్ని హతమార్చిన భారత జవాన్లు అనే వార్తలు తరచు వింటుంటాం. అలాగే ఉగ్రవాదుల చేతుల్లో బలి అయిన భారత జవాన్లు అనే వార్తలు కూడా వింటుంటాం. అలా భారతదేశం కోసం తమ ప్రాణాల్ని అర్పించే భారత జవాన్లు అనుక్షణ రెప్పవాల్చకుండా దేశ సరిహద్దు జమ్ము కశ్మీర్ లో కావలి కాస్తుంటారు. అక్కడ తరచు కాల్పుల మోతలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. భారత ఆర్మీకి..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు సర్వసాధారణంగా ఉంటుంది.
ఈక్రమంలో జమ్ముకశ్మీర్ లో సంవత్సర కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) హతమార్చింది. మరో 183 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకుంది. జమ్ముకశ్మీర్‌తోపాటు ఇతర చోట్ల కార్యకలాపాల గురించి సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ గురువారం ( మార్చి 17,2022) మీడియాకు వివరించారు. 2021 మార్చి 1 నుంచి 2020 మార్చి 16 వరకు జమ్ముకశ్మీర్‌లో 175 మంది ఉగ్రవాదులను సీఆర్పీఎఫ్ మట్టుబెట్టిందని ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ గురువారం (మార్చి 17,2022) తెలిపారు.
అదే సమయంలో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో 19 మంది మావోయిస్టులను సీఆర్పీఎఫ్ హతమార్చడంతోపాటు 699 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాళ్లు విసిరే సంఘటనలు చాలా వరకు లేవన్నారు. అలాగే విదేశీ ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులు కూడా తగ్గాయని వివరించారు.