Kashmir Encounter : రాజౌరి సెక్టార్ లో ఎదురుకాల్పులు..నలుగురు జవాన్లు వీరమరణం

జమ్ముకశ్మీర్ లో మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. రాజౌరి సెక్టార్ లో ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందారు.

Kashmir Encounter : రాజౌరి సెక్టార్ లో ఎదురుకాల్పులు..నలుగురు జవాన్లు వీరమరణం

Rajouri Sector

Updated On : October 11, 2021 / 1:47 PM IST

Jammu Kashmir Encounter : జమ్ముకశ్మీర్ లో మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. రాజౌరి సెక్టార్ లో సోమవారం (అక్టోబర్ 11,2021) ఉదయం ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందారు.జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా దళాల ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. సోమవారం పిర్ పంజల్ పరిధిలోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO),నలుగురు జవాన్లు వీరమరణం పొందారు.

Read more : Lashkar Commander : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

అదే సమయంలో, శ్రీనగర్ మేయర్ జునైద్ మట్టూ కూడా JCO తో సహా ఐదుగురు జవాన్లు నియంత్రణ రేఖపై వీరమరణం పొందారని తెలిపారు. ఉగ్రవాదుల్ని ఎదుర్కోవటానికి భారత సైనికులు అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారని ఈ పోరాటంలో సైనికుల బలిదానం వ్యర్థం కాదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

నిన్న రాత్రి అనంతనాగ్,బండిపోరాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇంతియాజ్ అహ్మద్ దార్‌గా గుర్తించారు. దార్ ఇటీవల ఒక సాధారణ పౌరుడిని చంపిన ఘటనలో ఉన్నాడని కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్, విజయ్ కుమార్ తెలిపారు.

Read more : Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ