BJP chiefs: రెండు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల్ని నియమించింది. ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా భూపేంద్ర సింగ్ చౌదురిని, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ భట్టాచార్యను బీజేపీ నియమించింది.

BJP chiefs: బీజేపీ అధిష్టానం రెండు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా జాట్ నేత భూపేంద్ర సింగ్ చౌదురిని నియమించింది. అలాగే త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ భట్టాచార్యను నియమించింది. భూపేంద్ర సింగ్ చౌదురి ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్‌గా కొనసాగుతున్నారు.

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

ఆయన స్వతంత్ర దేవ్ సింగ్ స్థానంలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. భూపేంద్ర సింగ్.. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన వర్గాన్ని ఆకర్షించే లక్ష్యంతో, అధ్యక్ష పదవి ఇచ్చింది. అలాగే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీని ఎదుర్కొనే ఉద్దేశంతో, బలమైన నేతగా పేరున్న భూపేంద్ర సింగ్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న సౌదాన్ సింగ్‌ను హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల బాధ్యుడిగా, దేవేంద్ర సింగ్ రాణాను సహ ఎన్నికల బాధ్యుడిగా నియమించింది. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన భూపేంద్ర సింగ్‌కు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. 27న హన్మకొండలో భారీ సభ

ఇంతకుముందు త్రిపుర సీఎం మాణిక్ సాహానే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చూసేవారు. తాజాగా ఆయనను ఆ పదవి నుంచి తొలగించి, రాజీవ్ భట్టాచార్యను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా ఆదేశాలు జారీ చేశారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తాజా మార్పులు చేసింది.