RLD President : ఆర్ఎల్‌డీ అధ్యక్షుడిగా జయంత్ చౌదరి
రాష్ట్రీయ లోక్‌దళ్(RLD) జాతీయ అధ్యక్షుడిగా దివంగత అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి(42) మంగళవారం ఎన్నికయ్యారు.

Jayant Chaudhary Appointed New Rld President
RLD President రాష్ట్రీయ లోక్‌దళ్(RLD) జాతీయ అధ్యక్షుడిగా దివంగత అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి(42) మంగళవారం ఎన్నికయ్యారు. వర్చువల్ గా జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఎల్‌డీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి.. జాతీయ అధ్యక్ష పదవికి జయంత్ పేరును ప్రతిపాదించారు, దీనిని మాజీ ఎంపి, జాతీయ ప్రధాన కార్యదర్శి మున్షిరామ్ పాల్ సహా జాతీయ కార్గవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారని ఆర్ఎల్‌డీ తన ప్రకటనలో తెలిపింది.
కొత్త ఆర్‌ఎల్‌డి చీఫ్‌గా నియమితులైన తర్వాత పార్టీ సభ్యులకు జయంత్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతకర్తలు చౌదరి చరణ్ సింగ్ మరియు అజిత్ సింగ్ అడుగుజాడలను అనుసరించాలని పిలుపునిచ్చారు. కాగా, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడిగా ఇంతవరకూ ఉన్న మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ మే-6 కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తండ్రి అజిత్ సింగ్ మృతిచెందడం వల్ల ఆయన స్థానంలో జయంత్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. కాగా, జయంత్ చౌధరీ లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మొన్నటివరకు ఆర్ఎల్‌డీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన విషయం తెలిసిందే.