జేఈఈ, నీట్-2020 సెప్టెంబర్ వరకు వాయిదా

కరోనాతో దేశం అల్లాడిపోతుంది. రోజురోజుకు కోవిడ్-19కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నీట్, జేఈఈ.. వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ మాట్లాడుతూ “విద్యార్థుల భద్రత మరియు విద్య నాణ్యతను దృష్టిలో ఉంచుకుని, మేము జేఈఈ మరియు నీట్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. జేఈఈ-మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 1 నుండి 6 వరకు, జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరుగుతుంది. నీట్ పరీక్ష సెప్టెంబర్ 13 న జరుగుతుంది.
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నీట్ జూలై 26 న, జేఈఈ-మెయిన్స్ జూలై 18 నుండి 23 వరకు జరగాల్సి ఉండగా.. జేఈఈ-అడ్వాన్స్ ఆగస్టు 23న జరగాల్సి ఉంది. నీట్ కోసం 15 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
అదే సమయంలో, సుమారు 9 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ మెయిన్ పరిక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ పరీక్షలు జూలై 18 నుండి 23 వరకు జరగాల్సి ఉండగా, జూలై 26 న నీట్ పరీక్షలు జరగాల్సి ఉంది.