వీళ్లని ఏం చేసినా తప్పు లేదు : ఉగ్రదాడిని స్వాగతిస్తూ సెలబ్రేషన్స్

గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకొన్న పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని నిమ్స్ యూనివర్శిటీలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న కాశ్మీర్ కి చెందిన నలుగురు విద్యార్థినులు తల్వీన్ మన్జూర్, ఇక్రా, జోహ్రా నజిర్, ఉజ్మా నజిర్ లు శనివారం(ఫిబ్రవరి-16,2018) రాత్రి పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ, ఉగ్రదాడికి పాల్పడిన వారిని కీర్తిస్తూ, ప్రతీకారం తీర్చుకొన్నామని సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. వాట్సాప్ లో దేశ వ్యతిరేక మెసేజ్ లు షేర్ చేసినందుకు ఇప్పటికే వారిని సస్పెండ్ చేసిన యూనివర్శిటీ అధికారులు నలుగురు విద్యార్థినులను పోలీసులకు అప్పగించారు.
నలుగురిలో ఒకరైన తల్వీన్ తన వాట్సాప్ స్టేటస్ లో పుల్వామా దాడి తమ ప్రతీకారానికి ధీటైన సమాధానం అని పెట్టింది. విథ్యార్థినుల చర్యలను యూనివర్శిటీ తీవ్రంగా ఖండిస్తోందని, ఇటువంటి కార్యకలాపాలను ఎంతమాత్రం సహించబోమని, కాలేజ్ తో పాటుగా హాస్టల్ నుంచి కూడా నలుగురిని సస్పెండ్ చేసినట్లు వర్శీటీ ఆదివారం(ఫిబ్రవరి-17,2019) ఓ ప్రకటనలో తెలిపింది.
నలుగురు విధ్యార్థినులకు వ్యతిరేకంగా యూనివర్శిటీలో పెద్ద ఎత్తున నినాదాలతో వర్శిటీ గేట్లను మూసివేసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పుల్వామా దాడిని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసిన వివిధ రాష్ట్రాల్లోని కాశ్మీర్ విద్యార్థులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నారు.