Delhi : JNU కొత్త రూల్..విద్యార్ధులు ధర్నాలు చేసినా, క్రమశిక్షణ తప్పినా రూ.50వేలు జరిమానా
JNU క్యాంపస్ లో ధర్నాలు చేస్తే రూ.20,000లు, క్రమశిక్షణ తప్పితే రూ.50,000లు,ధర్నాలు, ఆందోళన పేరుతో హింసలకు పాల్పడితే రూ.30,000లు జరిమానా విధించబడుతుంది అంటూ హెచ్చరించింది. క్యాంపస్ లో విద్యార్ధులు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది.

JNU Rules : to punish 'misconduct' and indiscipline with Rs 50,000 fine..
Delhi JNU: యూనివర్శిటీల్లో విద్యార్దులు ధర్నాలు, ఆందోళనలు చేయటం పరిపాటిగా మారిపోయింది. వర్శిటీల్లో సౌకర్యాలు…ఇతర సమస్యలపై విద్యార్ధులు ఆందోళనలు చేస్తుంటారు. కానీ ఇకపై అటువంటివి కుదరదని తేల్చి చెప్పింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU). దీనికి సంబంధించి బుధవారం (మార్చి 1,2023) నోటీసులు జారీ చేసింది. క్యాంపస్ లలో ధర్నాలు చేసినా..క్రమశిక్షణ తప్పినా భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దీనికి సిబంధించి జారీ చేసిన 10పేజీల నోటిఫికేషన్ లో పలు అంశాలను పేర్కొంది.
క్యాంపస్ లో ధర్నాలు చేస్తే రూ.20,000లు, క్రమశిక్షణ తప్పితే రూ.50,000లు,ధర్నాలు, ఆందోళన పేరుతో హింసలకు పాల్పడితే రూ.30,000లు జరిమానా విధించబడుతుంది అంటూ పేర్కొంది. క్యాంపస్ లో విద్యార్ధులు ఎటువంటి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. క్యాంపస్ లో ప్రశాంత వాతావరణం ఉండాలని..దీనికి ఎటువంటి భంగం వాటిల్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నోటిషికేషన్ లో ప్రకటించిన నిబంధనలను ప్రతీ ఒక్క విద్యార్థినీ, విద్యార్ధులు తూచా తప్పకుండా పాటించాలని ప్రకటించింది.
రూల్స్ ఆఫ్ డిసిప్లెయిన్ అండ్ ప్రాపర్ కాండక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ JNU పేరిట 10 పేజీల కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. JNU క్యాంపస్ లో ఇకనుంచి నిరసనలు, ఫోర్జరీలు చేస్తే దానికి తగినట్లుగానే శిక్షలుంటాయని పేర్కొంది. ఈ నియమ నిబంధనలు అన్నీ ఫిబ్రవరి 3 (2023) నుండి అమల్లోకి రానున్నాయని కాబట్టి విద్యార్ధులు చదువుపై శ్రద్ధ పెట్టి వారి వారి లక్ష్యాలను చేరుకోలని సూచించింది. ఇటీవల JNUలో ప్రతి విద్యార్ధి హాజరు తప్పనిసరి అని వర్శిటి ప్రకటించింది.
కాగా..క్యాంపస్ లో జరిగిన నిరసనలు ప్రదర్శించడంతో ఈ చర్యలకు JNU ఈ కొత్త నిబంధనలకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నియమావళిపై JNU ABVP యూనిట్ కార్యదర్శి వికాస్ పటేల్ మాట్లాడుతూ..ఈ కొత్త తుగ్లక్ ప్రవర్తనా నియమావళి అవసరం లేదని కొట్టిపారేశారు.
విద్యార్ధి సంఘాలతో సంప్రదించకుండా ఇటువంటి రూల్స్ పెట్టటం సరికాదని ప్రకటించిన ఈ తుగ్లక్ రూల్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా.. గతంలో ప్రధాని మోడీ ఓ ఇంటర్వ్యూలో పకోడీలు అమ్మడం కూడా ఓ ఉపాధి మార్గం అని అన్నారు. ఈ ఇంటర్వ్యూని బేసుకుని పైగా కొత్తగా వర్శిటీ ప్రకటించిన ఈ రూల్ ను వ్యతిరేకిస్తూ వర్శిటీ విద్యార్ధలు ఫిబ్రవరి 5 న పకోడాలు అమ్మారు. సబర్మతి బస్టాండ్ , అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సమీపంలోని టి-పాయింట్ వద్ద రహదారిని బ్లాక్ చేయడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వర్శిటీ సిబ్బందితో పాటు ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులకు అసౌకర్యం కలిగించారు. విద్యార్ధులు చేసే ఈ నిరసనను విరమించుకోవాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సూచించారు. అయినా విద్యార్ధులు మానలేదు. ధర్నా పాయింట్ లోనే ఆహారాన్ని వండి, అక్కడే తిని తమ నిరసనను వ్యక్తం చేశారు. అంతేకాదు..రాత్రి పూట నిరసన ప్రదేశంలో విద్యుత్ కేబుల్‌ను ఏర్పాటు చేసుకుని సినిమాలు ప్రదర్శించి వీక్షించారు. ఇటువంటి కార్యక్రమాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యార్ధుల్లో క్రమశిక్షణ లోపించడం వల్లే జరిగిందని భావించిన JNU ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.