JNU పరువు తీస్తున్నారు : కాంగ్రెస్,కమ్యూనిస్టులు వర్శిటీల్లో హింసను సృష్టిస్తున్నాయి

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వర్శిటీల్లో రాజకీయాలు తగవని విద్యార్ధుల భవిష్యు్త్తును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నాయనీ ఇటువంటి రాజకీయాలు వర్శిటీల్లో ఉండట సరికాదని అన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు వర్శిటీల్లో హింసను ప్రేరేపిస్తున్నాయి : మంత్రి జవదేకర్
జేఎన్ యూలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఢిల్లీలోని ఆప్ నాయకులతో పాటు మరికొన్ని శక్తులు కలిసి దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో హింసాత్మక వాతావరణం సృష్టించాలని కోరుకుంటున్నారని జవదేకర్ ఆరోపించారు.
Union Minister Prakash Javadekar: We condemn the violence in JNU. This needs to be investigated. Congress, Communists, AAP and some elements want to create environment of violence in universities across the country. #JNUViolence pic.twitter.com/jfh4wtDkh6
— ANI (@ANI) January 6, 2020
జేఎన్‌యూ పరువు తీస్తున్నారు : మంత్రి గిరిరాజ్ సింగ్
జేఎన్‌యూ ఘటనటపై వామపక్ష విద్యార్థులపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్రంచేశారు.వామపక్ష విద్యార్థులు జేఎన్ యూ పరువు తీస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. వర్సిటీని దౌర్జన్యాలకు, పోకిరీలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు.
Union Minister Giriraj Singh on #JNUViolence: Left students are defaming Jawaharlal Nehru University (JNU), they have turned the University into a centre of hooliganism. pic.twitter.com/AmjPiEnB3r
— ANI (@ANI) January 6, 2020
వర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చటం సరికాదు : స్మృతి ఇరానీ
జేఎన్‌యూలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభమైందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో దానిపై మాట్లాడడం సరికాదన్నారు. విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చకూడదు. విద్యార్థులను రాజకీయ బంటులుగా ఉపయోగించకూడదన్నారు స్మృతి ఇరానీ.
Union Minister Smriti Irani on #JNUViolence: Investigation has begun,so will not be right to speak on it now, but Universities should not be turned into hubs of politics, neither should students be used as political pawns. pic.twitter.com/Gor1mONKuM
— ANI (@ANI) January 6, 2020