J&J Covid-19 Vaccine : జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం..భారత్ లో టీకా అనుమతి దరఖాస్తు ఉపసంహరణ

అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్(జే అండ్ జే)సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.

J&J Covid-19 Vaccine : జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం..భారత్ లో టీకా అనుమతి దరఖాస్తు ఉపసంహరణ

Johnson

Updated On : August 2, 2021 / 5:00 PM IST

J&J Covid-19 Vaccine అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్(జే అండ్ జే)సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి కోసం భారత ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తును జాన్సన్ అండ్ జాన్సన్ ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని సోమవారం డీసీజీఐ(Drugs Controller General of India)తెలిపింది.

ఇండెమ్నిటీ(టీకా కారణంగా అనుకోని సమస్యలు తలెత్తిన సందర్భాల్లో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు న్యాయపరమైన చర్యల నుంచి రక్షణ)విషయంలో చట్టపరమైన చిక్కులను తొలగించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జాన్సన్ అండ్ జాన్సన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, ఎందుకు తమ అప్లికేషన్ ని ఉపసంహరించుకోవలసి వచ్చిందనేదానిపై జాన్సన్ అండ్ జాన్సన్ లేదా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ)ఇంకా స్పందించలేదు.

కాగా, తమ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్‌ లోనూ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని ఈ ఏడాది ఏప్రిల్ లో జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు ముందే అమెరికాలో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ నిలిచిపోయాయి. ఈ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టొచ్చన్న అనుమానాల కారణంగా అమెరికా ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్‌కు తాత్కాలికంగా నిలిపివేసింది.