Private Travels Bus : బస్సులో రీసౌండ్ మ్యూజిక్ పెట్టింనందుకు కండక్టరు, డ్రైవర్‌కు రూ.10,000 జరిమానా

బస్సులో పెద్ద సౌండ్ తో పాటలు పెట్టినందుకు న్యాయమూర్తి బస్సు కండక్టర్, డ్రైవర్ కు భారీ జరిమానా విధించారు. ప్రయాణీకుల ప్రశాంతత పాడు చేయవద్దు అంటూ మండిపడ్డారు.

Private Travels Bus : బస్సులో రీసౌండ్ మ్యూజిక్ పెట్టింనందుకు కండక్టరు, డ్రైవర్‌కు రూ.10,000 జరిమానా

Kancheepuram Tamil Nadu

Updated On : July 1, 2023 / 11:15 AM IST

Kancheepuram Tamil Nadu : అదొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు( private travel bus). తమిళనాడు (Tamil Nadu)కంపెనీకి సంబంధించినది. దాంట్లో పలువురు ప్రయాణీకులు ఉన్నారు. బస్సులో ప్రయాణీకుల కోసం పాటలు పెట్టారు డ్రైవరు, కండక్టరు. అదే బస్సులో కాంచీపురం జిల్లా కోర్టు న్యూయమూర్తి సెమ్మల్ కూడా ప్రయాణీస్తున్నారు. పాటలు పెద్ద సౌండ్ తో ఉండటంతో కాస్త సౌండ్ తగ్గించాలని న్యాయమూర్తి కండక్టర్, డ్రైవర్లను కోరారు. కానీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. గత గురువారం న్యాయమూర్తి సెమ్మల్ వ్యక్తిగత పనులమీద దిండివనం నుంచి తిరిగి వస్తున్న సమయం అది. బస్సులో పాటలు బిగ్గరగా పెట్టటంతో సెమ్మల్ కు చికాకు పుట్టింది. సౌండ్ తగ్గించమని అడిగినా వారు వినలేదు.

Madhya Pradesh: మహిళల సమ్మతి వయస్సును 18 నుంచి 16కి తగ్గించాలి.. కేంద్రాన్ని కోరిన హైకోర్టు

దీంతో న్యాయమూర్తి కాంచీపురం పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు కాంచీపురం మూంగిల్‌ మంటపం వద్దకు చేరుకొని ప్రైవేటు బస్సును అడ్డుకొన్నారు. ప్రయాణీకుల ఉత్సాహం కోసం పాటలు పెట్టారు సరే..గానీ సౌండ్ అంతగా బిగ్గరగా పెట్టటం పైగా ఇబ్బంది పడి సౌండ్ తగ్గించమని కోరినా పట్టింకోకపోవటం ఏంటీ? అంటూ ప్రశ్నించారు.దీంతో బస్సులో సౌండ్ తగ్గించమని కోరిన వ్యక్తి న్యాయమూర్తి అని తెలిసిన కండక్టరు, డ్రైవరు క్షమాపణలు చెప్పారు.

ప్రశాంతంగా ప్రయాణించాలనుకోవటం ప్రయాణీకుల హక్కు..దాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోలేదు అంటూ న్యాయమూర్తి సెమ్మల్ బస్సులో నుంచి దిగి కండక్టరు, డ్రైవర్‌కు బస్సు యజమానికి రూ.10 వేలను జరిమానా విధించి, ప్రయాణికుల భద్రతపై కండక్టరు, డ్రైవరు దృష్టి సారించాలని..ఇంకెప్పుడు ఇలా చేయవద్దని సూచించారు.

Madras High Court : భర్త ఆస్తులన్నింటిలోను భార్యకు సమాన వాటా : హైకోర్టు కీలక తీర్పు