Mayawati : యూపీలో ‘జంగిల్ రాజ్’ నడుస్తుంది.. మాయావతి ఫైర్
యూపీలో ‘జంగిల్ రాజ్’ నడుస్తున్నదని బీఎస్పీ (BSP) అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె తెలిపారు.

Jungle Raj Prevails In Up Mayawati As Violence Mars Panchayat Polls
Jungle Raj Prevails In UP : యూపీలో ‘జంగిల్ రాజ్’ నడుస్తున్నదని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ (BSP) అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె తెలిపారు. యూపీలో శాంతిభద్రతలపై, ప్రభుత్వ విధానంపై మాయావతి మండిపడ్డారు. బీజేపీ పాలనలో చట్టాలేమీ లేవన్నారు. కేవలం జంగిల్ రాజ్ మాత్రమే నడుస్తుందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో హింస చెలరేగిన నేపథ్యంలో లఖింపూర్‌లో ఓ మహిళ చీర లాగి, అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై స్పందించిన మాయావతి తీవ్రంగా ఖండించారు. పోటీలో ఉన్న వివిధ పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేశారు.
పాస్‌గవాన్ బ్లాక్ నుంచి ఎస్పీ నేత రీతూ సింగ్ కూడా నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో కొందరు దుండగులు ఆమెను అడ్డుకుని చీర లాగారు. నామినేషన్ పత్రాలను కూడా చించి పారేశారు. రీతూ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్లాక్ పంచాయతీ చీఫ్ కోసం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో హింస ఘటనలపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాయావతి యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రబలంగా ఉందని విమర్శించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల మద్దతుతో అభ్యర్థులను నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి అనుమతించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చండౌలి ప్రాంతంలో దళితుల ఇళ్లు దెబ్బతిన్నాయన్న ఆరోపణలపై మాయావతి బిజెపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై కేంద్రంలో, రాష్ట్రంలో దళిత మంత్రులు ఇంకా మౌనంగా ఉండటం విచారకరమని, ఆందోళన కలిగిస్తుందని మాయావతి విమర్శించారు.