తుఫాన్ బిడ్డ పుట్టేసింది : అప్పుడే పుట్టిన పాపకు ‘ఫోని’ పేరు

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 10:12 AM IST
తుఫాన్  బిడ్డ పుట్టేసింది : అప్పుడే పుట్టిన పాపకు ‘ఫోని’ పేరు

Updated On : May 3, 2019 / 10:12 AM IST

‘ఫోని’ తుఫాను బీభత్సం సృష్టిస్తున్న క్రమంలో ‘ఫోని’ బిడ్డ పుట్టింది. ఆయా సందర్భాలను బట్టి ఆ సమయంలో పుట్టిన శిశువులకు ఆ పేర్లు పెట్టుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. భువనేశ్వర్ లోని రైల్వే ఆస్పత్రిలో జన్మించిన ఓ పండంటి బిడ్డకు ఫోనిగా నామకరణం చేశారు.

మాంచేశ్వర్‌లోని కోచ్ రిపేర్ వర్క్‌షాప్‌లో హెల్పర్‌గా పని చేసే ఓ మహిళ శుక్రవారం (మే 3) బిడ్డకు ఉదయం 11:03 గంటల సమయంలో పండంటి ఆడబిడ్డకు రైల్వే ఆస్పత్రిలో జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి డాక్టర్స్ తెలిపారు. ‘ఫోని‘ తుఫాన్ ఒడిషాను అతలాకుతలం చేస్తున్నసంగతి తెలిసిందే. దీంతో ఈ పేరునే ఆ బిడ్డకు పెట్టినట్టు వైద్యులు చెప్పారు.