Justice Dipankar Datta : సుప్రీంకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకటో నెంబర్ కోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ సమక్షంలో దీపాంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. (ఫిబ్రవరి8, 2030) వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Dipankar Datta
Justice Dipankar Datta : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకటో నెంబర్ కోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ సమక్షంలో దీపాంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. (ఫిబ్రవరి8, 2030) వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కు చేరింది. సుప్రీంకోర్టులో మరో 6 జడ్జీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఈ ఆరు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేస్తే సుప్రీంకోర్టులో సీజేఐతో సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 అవుతుంది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని అప్పటి సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది సెప్టెంబర్ 26న సిఫారసు చేసింది.
Supreme Court: ఛారిటీ అంటే మత మార్పిడి చేయడం కాదు.. బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
దీనికి కేంద్ర న్యాయశాఖ అదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా (ఫిబ్రవరి9, 1965)న జన్మించారు. ఆయన తండ్రి జస్టిస్ సలీల్ కుమార్ దత్తా కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. సలీల్ దత్తా (జూన్22, 2006)న పదవీ విరమణ చేశారు.