Supreme Court: ఛారిటీ అంటే మత మార్పిడి చేయడం కాదు.. బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

బలవంతపు మత మార్పిడులు ప్రమాదకరమని, రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించింది భారత సుప్రీంకోర్టు. ఛారిటీ చేయడం అంటే మత మార్పిడులకు పాల్పడటం కాదని అభిప్రాయపడింది.

Supreme Court: ఛారిటీ అంటే మత మార్పిడి చేయడం కాదు.. బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

Supreme Court: ఛారిటీ చేయడం అంటే మత మార్పిడికి పాల్పడటం కాదని అభిప్రాయపడింది భారత సుప్రీంకోర్టు. దేశంలో జరుగుతున్న మత మార్పిడుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. మత మార్పిడులను అడ్డుకునేలా కేంద్రానికి, రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఒక పిటిషన్ దాఖలు చేశారు.

Himanta Biswa Sarma: మహిళలు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదు.. అజ్మల్‌కు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం

బెదిరించి, భయపెట్టి, ఆర్థిక ప్రయోజనాలు కలిగించి, డబ్బు ఆశ చూపి మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సీటీ రవి కుమార్ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మత మార్పిడులు రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇది చాలా తీవ్రమైన అంశం. ఛారిటీ చేయడం అంటే మత మార్పిడులకు పాల్పడటం కాదు. ఇతరులను తమ మతంలోకి ఆకర్షించడం ప్రమాదకరం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఈ అంశంపై న్యాయవాదులకు పలు సూచనలు చేసింది. ‘‘ఈ అంశంలో మరీ సాంకేతికంగా ఆలోచించనవసరం లేదు. ఇక్కడ మేం ఉన్నది పరిష్కారం చూపేందుకే. తప్పుల్ని సరి చేసేందుకే మేమున్నాం. ఒక వేళ ఏదైనా ఛారిటీ చేస్తే, దాని వెనుక ఎలాంటి దురుద్దేశాలూ లేకుంటే మేం వాటిని స్వాగతిస్తాం.

Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ‘ఆప్’దే హవా.. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి చెక్

అయితే, ఎవరికైనా సహాయపడటంలో ఏదైనా దురుద్దేశం ఉంటే మేం వాటి గురించి ఆలోచిస్తాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మత మార్పిడుల అంశంపై కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది. గతంలోనే మత మార్పిడుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడులు దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.