Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు 51వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా

భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో

Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు 51వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా

Justice Sanjiv Khanna

Updated On : November 11, 2024 / 10:24 AM IST

Justice Sanjiv Khanna: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, తాజా మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులు పాల్గొన్నారు.

Also Read: రూ.15వేల కోట్ల రుణం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు..

సీజేఐగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది మే 13వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారు. సంజీవ్ ఖన్నా ఎన్నికల బాండ్లు, అధికరణం 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఆరేళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు.