HUBBALLI : ఇంత కిరాతకమా ? కన్నడ నటి సోదరుడు హత్య కేసులో షాకింగ్ నిజాలు

హుబ్బళ్లి నగర శివారులోని దేవరగుడిహళ్లి ప్రాంతంలో ఈనెల 12వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తలను కోసుకుని మొండెం అక్కడే వదిలి వెళ్లారు.

HUBBALLI : ఇంత కిరాతకమా ? కన్నడ నటి సోదరుడు హత్య కేసులో షాకింగ్ నిజాలు

Crime

Updated On : April 24, 2021 / 1:11 PM IST

Kannada Actress Shanaya Katwe : ప్రేమలు కొందరి కుటుంబాలన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. అత్యంత దారుణాలకు తెగబడుతున్నారు. క్షణికావేశంలో సొంత వాళ్లనే చంపేంచేందుకు కూడా వెనుకాడడం లేదు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని సొంత తమ్ముడినే అక్క చంపేసింది. ఈమె సినీ నటి కావడం ఇక్కడ గమనార్హం. హుబ్బళ్లి నగర శివారులోని దేవరగుడిహళ్లిలో ఓ వ్యక్తి తలలేని శరీరం కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ కు అయ్యే విషయాలు వెలుగు చూశాయి.

హుబ్బళ్లి నగర శివారులోని దేవరగుడిహళ్లి ప్రాంతంలో ఈనెల 12వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తలను కోసుకుని మొండెం అక్కడే వదిలి వెళ్లారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే రోజు సాయంత్రం మరో ప్రాంతంలో తలను గుర్తించారు. అనంతరం ఉదయం గుర్తించిన మొండెం తాలూకు యువకుడిదేనని తేల్చారు. ఆ రెండింటిని అతికించిన తర్వాత దిమ్మదిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హత్యకు గురైంది..రాకేష్ అని తేలింది. ఇతను కొన్ని రోజులుగా కనిపించలేదు. ఘటనకు సంబంధించి నలుగురు దుండగులను వలపన్ని శుక్రవారం అర్టెసు చేశారు. ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే అక్కసుతోనే రాకేశ్ సోదరే శయన కాట్వే (వర్ధమాన నటి) హత్యకు ప్రేరేపించనట్లుగా విచారణలో తేలింది. నియాజ్, తవసీఫ్, అల్తాఫ్, అమన్ అనే నలుగురిని అరెస్టు చేశారు. దర్యాప్తులో అనూహ్యమైన విషయాలు వెలుగు చూశాయని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకడైన నియాజ్ – శయన ప్రేమికులు. వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించిన రాకేష్ ను అడ్డు తొలగిస్తే..సరిపోతుందని నియాజ్..నయన వద్ద ప్రస్తావించాడంట. అందుకు ఆమె అంగీకారం తెలపడంతో అదను చూసి స్నేహితుల సహకారంతో రాకేశ్ ను హతమార్చారని వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Read More : Second Wave Of COVID : కరోనా టైం.. పిల్లలు భద్రం సుమా