ప్రముఖ రచయిత చిమూ కన్నుమూత: ముఖ్యమంత్రి సంతాపం

  • Published By: vamsi ,Published On : January 11, 2020 / 05:46 AM IST
ప్రముఖ రచయిత చిమూ కన్నుమూత: ముఖ్యమంత్రి సంతాపం

Updated On : January 11, 2020 / 5:46 AM IST

సాహిత్య వర్గాలలో చిమూగా సుపరిచితులైన ప్రముఖ పండితుడు, పరిశోధకుడు మరియు రచయిత డాక్టర్ చిదానంద మూర్తి శనివారం(11 జనవరి 2020) తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. 88 ఏళ్ల చిదానంద మూర్తి కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే వేకువ జామున 3గంటల 30నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. 

వ్యతిరేకతతో సంబంధం లేకుండా సైద్ధాంతిక వైఖరికి పేరుగాంచిన ఎన్నో రచనలు చేశారు చిదానంద మూర్తి. కర్ణాటక కన్నడ భాష, సంస్కృతి, భూమి మరియు కర్ణాటక చరిత్రపై తన పరిశోధనలు చేసి చరిత్రకారుడుగా నిలిచారు. హంపి విజయనాగర సామ్రాజ్యం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు చిదానంద మూర్తి. మే 10, 1931 న దావనగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకాలో జన్మించిన చిమూ మైసూర్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. మైసూరు విశ్వవిద్యాలయంలోని కువెంపు, పు టీ నా, టీ నామ్ శ్రీ మరియు చరిత్రకారుడు ఎస్ శ్రీకాంత శాస్త్రి వంటి సాహిత్య ప్రతిభావంతుల ప్రభావంతో, చి ము ప్రశంసలు అందుకున్నారు. రచయిత మరియు పరిశోధకుడిగా స్థిరపడ్డారు.

కన్నడ శాసనాలపై ఆయన చేసిన డాక్టరల్ థీసిస్ కర్ణాటక చరిత్రలో ఒక ముఖ్యమైన రచనగా పరిగణించబడుతుంది. ప్రారంభంలో ప్రసిద్ధ యువరాజా కళాశాల మరియు మైసూర్ విశ్వవిద్యాలయం కన్నడ విభాగంలో కన్నడ ప్రొఫెసర్‌గా పనిచేసిన చిమూ తరువాత బెంగళూరు విశ్వవిద్యాలయంలో కన్నడ విభాగానికి అధిపతిగా మారారు.

కన్నడకు శాస్త్రీయ భాషా హోదాను పొందడంలో చిమూ ముఖ్యమైన పాత్ర పోషించారు. హిందూ-రైట్ వింగ్ ఛాంపియన్‌గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. హంపి కళాఖండాలను కాపాడాలంటూ ఆయన చేపట్టిన ప్రచారం విస్తృత ప్రాచుర్యం పొందింది. మూర్తి డిమాండ్ మేరకే నిజాం హైదరాబాద్ కర్ణాటక పేరును కల్యాణ్ కర్ణాటకగా ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప ఇటీవల మార్చారు. 
 
ముఖ్యమంత్రి సంతాపం:
మేథావిగా, పరిశోధకుడుగా, చరిత్రకారుడుగా కన్నడ భాషా పరిరక్షణకు చిదానంద మూర్తి విశేష సేవలందించారు. చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన లేని లోటు భర్తీ కాదని ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొనియాడారు. హంపీ కట్టడం పరిరక్షణలో ఆయన పాత్ర, కన్నడ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తింపు రావడానికి చేసిన కృషి బహుదా ప్రశంసనీయమని ఆయన గుర్తుచేసుకున్నారు.