War 2 Collections : ఫస్ట్ వీకెండ్ వార్ 2 కలెక్షన్స్ ఎన్ని కోట్లు? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? కూలీ కంటే ఎంత తక్కువ?
నాలుగు రోజులు హాలీడేస్ రావడం, ఈ సినిమాపై హైప్ ఉండటంతో కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి.

War 2 Collections
War 2 Collections : గత వారం ఆగస్టు 14న వార్ 2, కూలీ సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి తమిళ్ సినిమా, ఒకటి బాలీవుడ్ సినిమా అయినా మన తెలుగు హీరోలు ఉండటంతో ఈ రెండు సినిమాలకు తెలుగులో మంచి హైప్ వచ్చింది, బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు యావరేజ్ గానే నిలిచాయి.
నాలుగు రోజులు హాలీడేస్ రావడం, ఈ సినిమాపై హైప్ ఉండటంతో కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించడంతో తెలుగులో భారీ హైప్ ఉండటంతో నిర్మాత నాగవంశీ ఏకంగా 90 కోట్లు పెట్టి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు సమాచారం.
Also Read : Bollywood : బాలీవుడ్ వద్దు బాబోయ్.. పాపం చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు.. అందరూ దెబ్బ తిన్నవాళ్ళే..
వార్ 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 85 నుంచి 90 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. కూలీ మూవీ అధికారికంగా 151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అనౌన్స్ చేసినా వార్ 2 మాత్రం అనౌన్స్ చేయలేదు. మొదటి వీకెండ్ నాలుగు రోజులు వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 265 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 350 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. మరి ఓవరాల్ గా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగులో వార్ 2 సినిమా 75 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 180 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని తెలుస్తుంది. వార్ 2 సినిమా మొదట్నుంచి, అడ్వాన్స్ సేల్స్ నుంచి రేసులో వెనకపడే ఉంది. కూలీకి ఉన్నంత హైప్ లేకపోయినా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగు వరకు భారీ హైప్ ఉంది. బాలీవుడ్ లో రెగ్యులర్ స్పై యాక్షన్ సినిమాగానే చూసారు. కూలీ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 385 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే వార్ 2 కూలీ కంటే 120 కోట్లు తక్కువే కలెక్ట్ చేసింది. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతాయో చూడాలి.