Kannada Actress: సీరియల్ నటి సౌజన్య ఆత్మహత్య

కన్నడ టీవీ సీరియల్ నటి సౌజన్య బెంగళూరు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది.

Kannada Actress: సీరియల్ నటి సౌజన్య ఆత్మహత్య

Soujanya

Updated On : September 30, 2021 / 5:58 PM IST

Kannada television actress Soujanya: కన్నడ టీవీ సీరియల్ నటి సౌజన్య బెంగళూరు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. సౌజన్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. సౌజన్య కొడగు జిల్లాలోని కుశల్‌నగర్ నివాసి. అనేక సీరియల్స్ మరియు కొన్ని కన్నడ సినిమాల్లో నటించింది. ఆమె పాదాలపై టాటూల ద్వారా పోలీసులు ఆమెను గుర్తించారు. ఆమె గదిలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ దొరికింది.

సుసైడ్ నోట్ ఇంగ్లీష్ మరియు కన్నడలో రాసినట్లు పోలీసులు కనుగొన్నారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నటి సౌజన్య తన సూసైడ్ నోట్‌లో వెల్లడించింది. ఆమె ఆరోగ్యం క్షీణించడం మరియు పరిశ్రమలో అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు నోట్‌లో వెల్లడించింది. ఆత్మహత్య చేసుకోవడంపై సౌజన్య తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది. డిప్రెషన్ కారణంగా ఆమె ఈ చర్య తీసుకుంటున్నట్లు చెప్పింది. ఆమె ఎందుకు డిప్రెషన్‌కు గురైందని పోలీసులు ఆరా తీస్తున్నారు.

డెత్ నోట్‌లో మూడు తేదీలు వ్రాయబడ్డాయి – సెప్టెంబర్ 27, 28 మరియు 30. మూడు రోజుల క్రితం సౌమ్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడం మరియు చేసేందుకు పని లేకపోవడం వల్ల కొంతకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం సౌమ్య మృతదేహాన్ని రాజరాజేశ్వరి వైద్య కళాశాలకు పంపించారు. కుంభల్‌గోడిలోని సన్ వర్త్ అపార్ట్‌మెంట్స్‌లో కొంతకాలంగా ఆమె తన ప్రియుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది.