ఇలాక్కూడా అడగొచ్చా!! : సార్..నేను చనిపోయాను లీవ్ కావాలి..ఓకే  

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 03:55 AM IST
ఇలాక్కూడా అడగొచ్చా!! : సార్..నేను చనిపోయాను లీవ్ కావాలి..ఓకే  

Updated On : September 1, 2019 / 3:55 AM IST

లీవ్ కావాలంటే విద్యార్థులు మా బామ్మ చనిపోయిందనీ..లేదా తాతయ్య చనిపోయాడనీ సాకులు చెప్పిన స్కూళ్లకు బంక్ కొట్టటం జరుగుతుంటుంది. లేదా కడుపునొప్పనో..కాలునొప్పనో…జ్వరం వచ్చిందనే సాకులు చెప్పి స్కూల్ ఎగ్గొడుతుంటారు. కానీ ఓ ఆకతాయి మాత్రం ఏకం తానే చనిపోయినంటూ ప్రిన్సిపాల్ కు సెలవుకావాలంటూ లీవ్ లెటర్ కూడా రాశాడు. దానికి స్కూల్ ప్రిన్సిపల్ ఓకే చెప్పటం మరీ వింతగా మారింది. 

సార్..నేను చనిపోయాను..నాకు లీవ్ కావాలి..అంటు ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ కు లెటర్ రాశాడు..! ఆ లెటర్ అందుకున్న  ప్రిన్సిపాల్ ఓకే లీవ్ సాంక్షన్ చేస్తూ సంతకం కూడా చేశారు…!  ఏంటీ చనిపోయిన విద్యర్థి లీవ్ లెటర్ రాయటమేంటి?.దానికి ప్రిన్సిపాల్ ఓకే చెప్పటం ఏంటీ? ఇదేం విడ్డూరం అనుకుంటున్నారు కదూ..ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ స్కూల్ చోటుచేసుకుంది. ఇది స్టూడెంట్ ఆకతాయితనంతో కూడిన తెలివితేటలకు ప్రిన్సిపాల్ బకారా అయిపోయిన ఉదంతం బైటపడింది. ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయంకాస్తా చర్చనీయాంశంగా మారింది. సదరు విద్యార్థి రాసిన లెటర్ ఎంత ప్లాన్డ్ గా రాశాడో చూద్దాం.. 

8th క్లాస్ చదువుతున్న  పార్థ్ విజయ్(పేరుపేర్చాం)అనే నేను ఆగస్టు 20న 10 గంటలకు మరణించాను..కాబట్టి పార్థ్‌కు దయచేసి హాఫ్‌డే లీవ్ ఇవ్వండి’ అని లీవ్లెటర్ ద్వారా కోరాడు. ఈ  లెటర్ అందుకున్న ప్రిన్సిపాల్ దాన్ని చూడకుండానే రెడ్ ఇంక్ పెన్నుతో గ్రాంటెడ్ అని సంతకం పెట్టేశారు. ఆ లెటర్ ను తీసుకున్న సదరు విద్యార్థి ఎంచక్కా పుస్తకాలు బ్యాగ్ లో సర్దేసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత ఈ లెటర్ పార్థ్ విజయ్ స్నేహితుల కంటపడింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారటం..సోషల్ మీడియాలో ప్రిన్సిపల్ సంతకం చేసిన లీవ్ లెటర్ వైరల్ అయ్యింది.