Karnataka Cabinet Expansion: కర్ణాటక ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 24మంది ఎమ్మెల్యేలు..

క్యాబినెట్ విస్తరణలో భాగంగా 24 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వారి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.

CM Siddaramaiah and Deputy CM Shivakumar

Karnataka Cabinet: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం విధితమే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వేరే పార్టీతో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 20న సిద్ధరామయ్య సీఎంగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా సిద్ధరామయ్య ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణకు చర్యలు చేపట్టింది. శనివారం ఉదయం 11.45 గంటలకు రాజ్ భవన్ లో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించింది. రాష్ట్రంలో జిల్లాలు, కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మంత్రుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధం చేసింది. వీరిలో గరిష్ఠంగా ఆరుగురు ఎమ్మెల్యేలు లింగాయత్ వర్గానికి చెందిన వారు ఉన్నారు. నలుగురు వొక్కలిగ వర్గానికి, ఐదుగురు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, వెనుకబడిన వర్గానికి చెందిన వారు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో పాటు ముస్లిం, బ్రాహ్మణ, నామ్ ధారిరెడ్డి, జైన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి వర్గంలో చోటు లభించింది.

Karnataka CM Swearing: సిద్ధరామయ్య, శివకుమార్‌తో కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది వీరే.. జాబితా విడుదల చేసిన అధిష్టానం

క్యాబినెట్ విస్తరణలో భాగంగా 24 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వారి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేవారిలో.. హెచ్‌కే పాటిల్, కృష్ణ బైరేగౌడ, ఎన్ చెలన్ స్వామి, కే. వెంకటేష్, హెచ్‌సీ మహదేవప్ప, ఈశ్వర్ ఖండ్రే, కేఎన్ రాజన్న, దినేష్ గుండూరావు, శరణబసప్ప, శివానంద పాటిల్, ఆర్‌బీ తిమ్మాపూర్, ఎస్‌ఎస్ మల్లికార్జున, శివరాజ్ తంగడ్గి, శరణ్ ప్రకాష్ పాటిల్, మంకల్వైద్, లక్ష్మీ హెబాల్కర్, రహీమ్ ఖాన్, డి. సుధాకర్, సంతోష్ లాడ్, ఎన్‌ఎస్ బోస్ రాజో, బయర్తి సురేష్, మధు బంగ్రప్ప, ఎంసీ సుధాకర్, బి. నాగేంద్రలు ఉన్నారు.

TDP Mahanadu: మహానాడుకు సిద్ధమైన రాజమహేంద్రవరం.. పార్టీ ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటించనున్న చంద్రబాబు

ఈనెల 20న సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఎవరికి ఇప్పటి వరకు పోర్టుఫోలియోలు కేటాయించలేదు. ఈరోజు మరో 24మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలో అందరికీ ఒకేసారి శాఖల కేటాయింపు చేయనున్నారు. ఎవరికి ఏ శాఖను కేటాయిస్తారనే అంశం కన్నడనాట చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హైకమాండ్ తో సిద్ధ రామయ్య, శివకుమార్ లు విడివిడిగా భేటీ అయ్యి ఎవరికి ఏ శాఖను కేటాయించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. హైకమాండ్ ఆదేశాల మేరకు శాఖల కేటాయింపు ఉంటుందని సమాచారం.