Karnataka CM Swearing: సిద్ధరామయ్య, శివకుమార్‌తో కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది వీరే.. జాబితా విడుదల చేసిన అధిష్టానం

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Karnataka CM Swearing: సిద్ధరామయ్య, శివకుమార్‌తో కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది వీరే.. జాబితా విడుదల చేసిన అధిష్టానం

Karnataka Congress

Karnataka CM Swearing: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar)తో పాటు మంత్రులుగా మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ఎనిమిది మంది మంత్రులు ఎవరై ఉంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ ఎనిమిది మంది జాబితాను కాంగ్రెస్ పార్టీ అదిష్టానం విడుదల చేసింది.

Karnataka CM Swearing: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.. ఎవరెవరు హాజరువుతున్నారంటే?

సిద్ధరామయ్య, శివకుమార్ శుక్రవారం అర్థరాత్రి వరకు ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలో కొత్త క్యాబినెట్ లో చేరాల్సిన మంత్రుల పేర్లు, శాఖల కేటాయింపుపై పార్టీ హైకమాండ్ తో చర్చించారు. చర్చల అనంతరం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తొలి విడతలో మంత్రి పదవులు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చింది. వీరంతా సిద్ధ రామయ్య, శివకుమార్ తో కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Karnataka CM: 2018 సీన్ మళ్లీ కనపడుతుందా? ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియం సిద్ధం.. ప్రత్యేకతలేంటీ?

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారిలో జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (మైనార్టీ -ముస్లీం)లు ఉన్నారు. వీరంతా సిద్ధ రామయ్య, శివకుమార్ తో కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

 

 

మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్‌తో పాటు ఎనిమిది ఎమ్మెల్యేలను మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. కర్ణాటకలో బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇది కర్ణాటకకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నానని, సిద్ధరామయ్య, శివకుమార్‌తోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.